
2023 తెలంగాణ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ జీవం తీశాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ ఒక్క ఓటమి కేసీఆర్ ను రాజకీయంగా మూగవాడిని చేసింది. పార్టీ కార్యక్రమాలలో నిస్సహాయుడిగా మిగిల్చింది.
ఒకపక్క ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత అరెస్టు మరో పక్క బిఆర్ఎస్ పార్టీ ఓటమి కలిసి కేసీఆర్ రాజకీయ జీవితాన్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసాయి. దానికి తోడుపార్టీ ఫిరాయింపులతో BRS నాయకులు గులాబీ కారు గాలి తీశారు.
ఇక బిఆర్ఎస్ బీజేపీలో విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాలు పార్టీ క్యాడర్ ను అయోమయంలోకి నెడుతున్నాయి. ఇక ఈ ఫార్ములా రేసింగ్ కేసు, ఫోన్ టాపింగ్ కేసులు కేటీఆర్ ను వెంటాడుతుండగా, కాళేశ్వరం కేసీఆర్ ను హరీష్ ను టార్గెట్ చేస్తుంది.
ఇవన్నీ ఒకపక్క బిఆర్ఎస్ లో కవిత రేపిన అసంతృప్తి చిచ్చు మరోపక్క బిఆర్ఎస్ ను రాజకీయంగా కుంగతీస్తున్నాయి. ఇక తాజాగా కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నిందితుల పై ఏసీబీ ఛార్జ్ షీట్ సిద్ధం చేసిందని, కేవలం ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తోందంటూ తెలంగాణ రాజకీయాలలో గట్టి ప్రచారమే జరుగుతుంది.
ఒకవేళ ఈ కేసులో కేటీఆర్ అరెస్టు అయితే..? బిఆర్ఎస్ పార్టీలో వాట్ నెక్స్ట్.? అనే ప్రశ్న బిఆర్ఎస్ శ్రేణులను వేధిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ దాదాపు రాజకీయాలలో వాలంటరీ రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చేసారు.
మొన్న సంక్రాంతికి కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి వస్తారు అంటూ ప్రకటించిన బిఆర్ఎస్ ఇప్పుడు దసరా వచ్చినా కేసీఆర్ ను ఫామ్ హౌస్ గడప దాటాయించలేకపోయింది, ప్రజల దగ్గరకు తీసుకురాలేకపోయింది.
దీనితో పార్టీ బాధ్యతలన్నీ అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ రాక, కేటీఆర్ లేక, కవిత రాలేక ఇలా ‘కల్వకుంట్ల’ పార్టీ భవిష్యత్ కాస్త ‘తన్నీరు’ చేతిలోకి వెళ్లనుందా.? అన్న చర్చ జరుగుతుంది.
ఈ విషయాన్నే నాడు కవిత పరోక్షంగా హెచ్చరించారా.? ఈ రోజ్ నాకు రేపు కేటీఆర్, ఆ మరుసటి రోజు కేసీఆర్ కు హరీష్ రావు, సంతోష్ రావు ల రాజకీయం నుండి రిటర్న్ గిఫ్ట్ తప్పక వస్తుంది అంటూ నాడు కవిత చేసిన ఆరోపణలు కేటీఆర్ అరెస్టుతో నిజమవుతాయా.?
కేటీఆర్ ఒక్క అరెస్టు బిఆర్ఎస్ ను కల్వకుంట్ల నుంచి దూరం చేస్తుందా.? లేక కల్వకుంట్ల లో మొదలైన రాజకీయ చిచ్చును ఆర్పీ దగ్గరగా జరుపుతుందా.? అంటే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తే బిఆర్ఎస్ ఉనికి అనేది ఇక్కడ స్పష్టమయింది.
Over the last few years, South films, starting from Baahubali in 2015, have undoubtedly created…
An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…