అసలే గురువారం. అందులోనూ హిందీ మార్కెట్ కి వీకెండ్స్, పండగల సమయంలో తప్ప పెద్దగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అని అనుకోలేం. కానీ రజని కాంత్ రోబో 2.0కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అనే చెప్పవచ్చు. అయితే భారీ తారాగణం కావడం, శంకర్-రజని ఫ్లేవర్ బాగా వర్క్ అవడం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా బాలీవుడ్ కి వచ్చే సరికి ఆ కలెక్షన్స్ లో అసలు కారణం అక్షయ్ కుమార్ అని ప్రత్యేకంగా చెప్పవచ్చు. అయితే తొలి రోజు దాదాపుగా 20కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. కొన్ని బడా మల్టీ ప్లెక్స్ లు చేతులెత్తేసినప్పటికీ, మిగిలిన వాటిల్లో మాత్రం మంచి వసూళ్లు వచ్చాయి. పైగా మాస్ థియేటర్స్ లో ఈ సినిమాకి గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కడం విశేషంగా చెప్పవచ్చు.
[m9ad]
ముఖ్యంగా డిల్లీ-ఉత్తర ప్రదేశ్ లలో దాదాపుగా 4.75 నుంచి 5 కోట్ల వరకూ వసూళ్లు సాధించగా, తూర్పు పంజాబ్ లో 1.9కోట్ల వసూళ్లను ఈ సినిమా సాధించింది. ఇక బీహార్ లో కూడా దాదాపుగా 1.25 వరకూ వసూళ్లు సాధించి డీసెంట్ వసూళ్లను తొలి రోజు నెలకొల్పింది ఈ సినిమా. అయితే ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే డిల్లీ, ఉత్తర ప్రదేశ్ మినహా, మిగిలిన రాష్ట్రాల్లో కాస్త అంచనా వేసిన లెక్కలకు తక్కువగానే ఈ సినిమా వసూళ్లు వచ్చాయి. ఆ రాష్ట్రాల్లో ఇంకాస్త మెరుగైన వసూళ్లు సాధించి ఉంటే బావుండేది అనేది ట్రేడ్ వర్గాల సూచన. అయితే ఇక్కడ చిన్న కిక్ ఇచ్చే విషయం ఏంటి అంటే అక్షయ్ కుమార్ లాంటి మిడ్ రేంజ్ హీరోతో తొలి రోజు 20 కోట్ల వసూళ్లు రాబట్టడం మంచి పరిణామమే.
అయితే వారాంతరం కావడం ఈరోజు నుంచి మరో మూడు రోజులు ఈ సినిమా కలెక్షన్స్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది అన్న అంచనాలు భారీగా ఉన్నాయి ట్రేడ్ వర్గాల్లో. పైగా బాలీవుడ్ లో కూడా చెప్పుకోదగ్గ బడా సినిమాలు దగ్గర్లో లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రోబో తడి గుడ్డ వేసుకు పడుకోవచ్చు అని చెప్పవచ్చు. మొత్తంగా తొలి రోజు మంచి వసూళ్ల లెక్కలే నమోదు చేశాడు మనం చిట్టి 2.0 అనడంలో ఏమాత్రం సందేహం లేదు.



