
ఎన్నో అంచనాలతో మరెన్నో సవాళ్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఉన్న అన్ని ఆదాయ మార్గాలను, అన్ని అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ తమ ప్రభుత్వ తొలి బడ్జెట్ ను నేడు అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టింది.
2024 – 25 సంవత్సరానికి గాను 2 . 94 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయరంగానికి గాను 43 ,402 కోట్లు కేటాయించారు. అలాగే పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు గాను 16, 739 కోట్లు, పాఠశాల విద్య కు 29909 కోట్లు కేటాయింపులు చేసారు.
మిగిలిన శాఖల బడ్జెట్ వివరాల విషయానికి వస్తే…
* పట్టణాభివృద్ధి ….11490 కోట్లు
*గృహ నిర్మాణం ….4012 కోట్లు
*పరిశ్రమలు, వాణిజ్యం…3127 కోట్లు
*ఆరోగ్య రంగం…18421 కోట్లు
*జలవనరులు ….16705 కోట్లు
*ఇంధన రంగం…8207 కోట్లు
*రోడ్డు, రవాణా, భావనలు…9554 కోట్లు
*పోలీస్ శాఖ…8495 కోట్లు
*యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ…322 కోట్లు
*ఉన్నత విద్య…2326 కోట్లు
*మానవ వనరుల అభివృద్ధి…1215 కోట్లు
*మైనారిటీ సంక్షేమం…4376 కోట్లు
*బీసీ సంక్షేమం…39007 కోట్లు
*ఎస్టీ సంక్షేమం…7557 కోట్లు
*ఎస్సి సంక్షేమం….18497 కోట్లు
*పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ…687 కోట్లు కేటాయింపు జరిగాయి.
అయితే బడ్జెట్ మీద ప్రజల పక్షాన ప్రభుత్వం తో సభలో చర్చవలసిన వైసీపీ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టుకుంటూ, పోస్టులు చేసుకుంటూ ప్రజా తీర్పుని అగౌరవపరుస్తూ ఐదేళ్లు కళ్ళు మూసుకోవడానికి సిద్దమయ్యింది.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…