
2024 సంవత్సరం సినీ లవర్స్ కు ఒక పండగ లాంటి సంవత్సరం అనే చెప్పచ్చు. ఈ ఏడు అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమాలెన్నో థియేటర్ల ముందర హడావుడి చేశాయి. ఎన్.టీ.ఆర్ ‘దేవర’, ప్రభాస్ ‘కల్కి’, బన్నీ ‘పుష్ప-2 ‘, టిల్లు స్క్వేర్, నాని ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలెన్నో బాక్స్-ఆఫీస్ వద్ద కాసులు పండించాయి.
అయితే 2024 లో విడుదలైన మొదటి పెద్ద హీరో సినిమాగా నిలిచింది ‘గుంటూరు కారం’. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ క్యారెక్టర్ గా నటించిన ఈ సినిమా పై రిలీజ్ కు ముందు అభిమానులలో ‘ఖలేజా, అతడు’ వంటి సినిమాలు తెరకెక్కించిన గురూజీ-మహేష్ ల కాంబినేషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే, ఆ అభిమానుల ఆశల తీరాలను అందుకునే విషయంలో విఫలమయింది గుంటూరు కారం. కేవలం మహేష్ బాబు కామెడీ టైమింగ్, మరియు థమన్ అందించిన మ్యూజిక్ మాత్రమే సినిమా లో హైలైట్ గా నిలిచాయి. ఏది ఏమైనా, మహేష్ బాబు స్టార్-డం ను క్యాష్ చేసుకుని ఒడ్డునపడ్డారు చిత్ర నిర్మాతలు.
మరి ఈ ఏడు విడుదలైన మొదటి చిత్రమే కాదు, ముగింపు పలకబోతున్న చివరి పెద్ద సినిమా లో కూడా సూపర్ స్టార్ భాగమయ్యారు. హాలీవుడ్ సినిమా ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రం తెలుగు వెర్షన్ లో మహేష్ లీడ్ క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పారు. ఇలా, ఈ ఏడు తెలుగు సినిమాల ఆది, అంతం రెండు కూడా ‘బాబు తో నే మొదలయ్యి, బాబు తో నే ముగియనున్నాయి’ అని ఫాన్స్ సంబరపడుతున్నారు.
Bellamkonda Ganesh is joining forces with renowned director A. Karunakaran for an exciting new-age romantic…
Mumbai Airport Police have issued a warning after a fraud case came to light outside…