2029…రాష్ట్రాలకే కాదు కేంద్రానికి కీలకమేనా.?

2029 ఎన్నికల కోసం కొన్ని రాజకీయ పార్టీలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే మరికొన్ని పార్టీలు వచ్చేది మేమే అంటూ కళ్ళు మూసుకుని రోజులు లెక్కిస్తూ ఎదురుచూస్తుంది. అయితే ఆ పార్టీల లిస్ట్ లో ఇప్పటి వరకు ప్రాంతీయపార్టీలే కీలకంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలతో 2029 ఎన్నికలు జాతీయ పార్టీలకు, సోషల్ మీడియా పార్టీలకు అత్యంత కీలకం కానున్నాయి అనేది స్పష్టమవుతుంది.

జంతర్ మంతర్ వేదికగా నీట్ ఉద్యమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా వరకు వ్యాపించింది. ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా సీజేపీ, ఇండి కూటమి చేస్తున్న పోటాపోటీ ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ADVERTISEMENT

దేశ రాజధాని ఢిల్లీ లో ఎదో జరుగుతుంది, రాబోయే రోజులలో దేశ రాజకీయాలలో ఎదో కీలక మార్పులు జరగబోతున్నాయి అనేలాంటి పరిస్థితులను సృస్టిస్తున్నాయి సీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. దేశ ప్రజలు ముఖ్యంగా జెన్ జీ లు కేంద్రంలో అధికార మార్పిడి కోరుకుంటున్నారు అనేలాంటి సంకేతాలు పంపిస్తున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ నేత రాహుల్ చాల దూకుడుగా బీజేపీ పై విమర్శలు సాగిస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యం అన్నట్టుగా ఒక్కో అడుగు వేస్తున్నారు. ఇన్నాళ్ల తన అధికార వనవాసానికి ఇక పట్టాభిషేకం తప్పదు అనేలా పరిస్థితులను తమకు అనూకులంగా మలుచుకునేందుకు, తమకు అనుకూలంగా మారిపోయాయి అనేలా చెప్పుకునేందుకు రాహుల్ పడుతున్న తాపత్రయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.

ఇక కాక్రోచ్ జనతా పార్టీ అంటూ అంటూ దేశ ప్రజల ముందుకొచ్చిన సీజేపీ తమకు రాజకీయ ఉద్దేశాలు లేవంటూ మొదలుపెట్టి ఇప్పుడు కేవలం రాజకీయమే చేయడం చూస్తుంటే సీజేపీ లక్ష్యం కూడా 2029 ఎన్నికలే అనేది సుస్పష్టం అవుతుంది. ఎన్నికలకు ఇంకా రెండెన్నరేళ్ళు ఉన్నప్పటికీ ఒకపక్క కాంగ్రెస్ మరోపక్క సీజేపీ తమ ఉద్యమాలతో బీజేపీ ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

రోజుకో కారణంతో ఉద్యమిస్తూ, నిరసన కార్యక్రమాలంటూ రోడ్ల మీదకొస్తూ దేశ రాజధాని ఢిల్లీని ఆంక్షల వలయం లో ఉంచుతున్నారు, ఢిల్లీని ఒక ఉద్రిక్త ప్రాంతంగా మారుస్తున్నారు. బీజేపీ పై వ్యతిరేకత అంటూ ప్రపంచం ముందు భారతదేశ పరువును నడిరోడ్డుపై లాగుతున్నారు.

నాడు బంగ్లాదేశ్ లో మాదిరి, నేపాల్ తరహాలో భారత్ లో కూడా ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి అంటూ ఇండి కూటమి, సీజేపీ లు చేస్తున్న ప్రచారాలు అన్ని కూడా 2029 ఎన్నికల టార్గెట్ గానే ముందుకు వెళుతున్నాయి అనేది జగమెరిగిన సత్యమే.

ఈ రెండు వర్గాలు ఇప్పుడే దేశ రాజధానిని ఇలా ఉద్యమాల నిలయంగా మార్చేస్తుంటే ఇక ఎన్నికలకు ముందు తమ అధికారం కోసం విపక్షాలు, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అధికార పక్షం ఢిల్లీ కేంద్రంగా ఇంకెన్ని రాజకీయ ఉద్యమాలను సృష్టిస్తాయో.? ఇంకెన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఢిల్లీ ప్రజలను ఇబ్బందిపెట్టనున్నాయో చూడాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas vs Salman Clash: What’s Vanga Planning?

After the success of Animal, audiences are eagerly waiting to see what Sandeep Reddy Vanga…

20 minutes ago

Big Films Coming But No Noise At All!

Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…

50 minutes ago