
సిఎం చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదేరోజు అంటే సెప్టెంబర్ 1వ తేదీన తొలిసారిగా సమైక్యరాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1999లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
నాలుగు దశాబ్ధాల చంద్రబాబు నాయుడి సుదీర్గ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా తనదైనశైలిలో పనిచేసి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, ఐటి, ఉద్యోగాలు, చురుకైన పాలన అనే మంచి పేరు సంపాదించుకున్నారు.
ముఖ్యమంత్రి చేతిలో యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కనుక ఏమాత్రం దీక్షాదక్షతలు ఉన్నా తప్పక రాణించవచ్చు. జగన్ అలా కూడా రాణించలేకపోయారు. అది వేరేవిషయం. అప్రస్తుతం.
కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రతిపక్ష నాయకుడుగా కూడా రాణించడం అంటే చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా కూడా తన సమర్దత చాటుకున్నారు.
గత 5 ఏళ్ళలో ఆయన ఎదుర్కొనన్ని సమస్యలు, సవాళ్ళు, వేధింపులు అన్నీ ఇన్నీ కావు. అదే మరొకరైతే రాజకీయాల నుంచి తప్పుకునేవారు. మరో పార్టీ అయితే చెల్లాచెదురు అయిపోయేది!
కానీ 74 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు అద్భుతమైన పోరాట పటిమ, రాజకీయ చతురతతో ముందుకు సాగుతూ, పార్టీని కాపాడుకుంటూ తనకు తిరుగేలేదనుకున్న జగన్మోహన్ రెడ్డిని మట్టి కరిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.
కనుక చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానాన్ని రెండుగా విభజించి చూస్తే రాష్ట్రాభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ప్రతిపక్షనాయకుడుగా చూస్తే అపర చాణక్యుడు వంటి గొప్ప మేధావి అయిన పోరాట యోధుడుగా కనిపిస్తారు.
అయితే అధికారంలో ఉన్నా లేకపోయినా సిఎం చంద్రబాబు నాయుడు ఏనాడూ మిడిసిపడలేదు. కేసీఆర్, జగన్ చివరికి కొడాలి నాని, రోజా వంటివారు కూడా తనని అవహేళన చేస్తున్నా సంయమనం కోల్పోలేదు. సరైన అవకాశం కోసం చాలా ఓపికగా ఎదురుచూస్తుంటారు.
సమయం వచ్చినప్పుడు అందరి బాకీలు వడ్డీతో సహా తప్పక చెల్లించేస్తుంటారు. అందుకు నిదర్శనంగా జగన్, కేసీఆర్ మన కళ్ళ ముందే ఉన్నారు. అనన్ని ప్రగల్భాలు పలికిన జగన్, కేసీఆర్ పరిస్థితి నేడు ఎలా ఉందో, సిఎం చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఉన్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.
కనుక సింహం అడవిలో ఉన్నా బోనులో ఉన్న సింహమే అన్నట్లు అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు… చంద్రబాబు నాయుడే.
నిర్మాత బండ్ల గణేశ్ భాషలో సింపుల్‌గా చెప్పాలంటే భగవంతుడు సృష్టించిన ఓ ‘లిమిటెడ్ ఎడిషన్ పీస్’ సిఎం చంద్రబాబు నాయుడు.
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…