Telugu

రుషికొండ ప్యాలస్‌కు 500 కోట్లు.. పక్కనే ఉన్న బీచ్‌కి జీరో!

విశాఖ రాజధాని పేరుతో విశాఖతో వైసీపీ నేతలు విశాఖ నగరంతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కబ్జాలకు పాల్పడగా, వారి అధినేత రుషికొండని కబ్జా చేసి సుమారు రూ.500 కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు చేసి తన కోసం విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకున్నారు.

విశాఖలో బస్టాండ్లపై కూడా తన ఫోటోలు పెట్టించుకున్న జగన్‌, 5 ఏళ్ళలో విశాఖలో కొత్తగా ఒక్క ఫ్లై ఓవర్‌ కట్టించలేదు. కనీసం ఒక్క రోడ్ వేయించలేదు.

ADVERTISEMENT

జగన్‌ సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇచ్చారు కనుక వీటన్నిటినీ పట్టించుకోలేదని సరిపెట్టుకున్నా, రుషికొండ ప్యాలస్‌లలో ఏ గదిలో కూర్చున్నా పక్కనే ఉన్న అందమైన బీచ్ కనిపించేలా నిర్మించుకున్నప్పుడు, బీచ్ పరిసర ప్రాంతాలను కూడా చక్కగా తీర్చిదిద్దాలి కదా?

ప్యాలస్‌ల కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన జగన్‌ ప్రభుత్వం రుషికొండ బీచ్ వద్ద మౌలిక సదుపాయాల కల్పన కోసం కనీసం రూ.5 కోట్లు ఖర్చు చేయలేదు.

విశాఖ ప్రధాన పర్యాటక కేంద్రాలలో ఒకటైన రుషికొండ బీచ్ కానీ నిత్యం వేలాదిమంది పర్యాటకులు వచ్చే రుషికొండ బీచ్ వద్ద కనీస మౌలిక వసతులు కూడా లేవు.

సాధారణంగా సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా పర్యాటకులు బీచ్‌కి వస్తుంటారు. కానీ చీకటి పడితే రుషికొండ బీచ్ వద్ద ఎవరూ ఉండలేరు. బీచ్ మొత్తానికి ఓకే ఒక హైమస్ట్ లైట్ ఉంది. మిగిలిన ప్రాంతం అంతా చీకటి అలుముకుంటుంది. కనుక చీకటి పడితే మహిళలు, చిన్నారులు అక్కడ ఉండటం చాలా ప్రమాదకరం. ఇక రుషికొండ బీచ్‌లో ఎక్కడ చూసినా చెత్త చెదారం, మురికి వాసనతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు.

రుషికొండ బీచ్‌లో ఇటువంటి దుస్థితి నెలకొని ఉన్నందునే ‘బ్లూఫ్లాగ్ హోదా’ తొలగించబడింది. దీంతో జిల్లా పర్యాటకశాఖ, జీవీఎంసీ యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యలన్నీ పరిష్కరించడంతో, బ్లూఫ్లాగ్ ఇండియా అధికారులు వచ్చి రుషికొండ బీచ్‌ని పరిశీలించిన తర్వాత ‘బ్లూ ఫ్లాగ్’ హోదా మళ్ళీ పునరుద్దరిస్తున్నట్లు శనివారం ప్రకటించారు.

అయితే ఇటువంటి సమస్యలు ఒక్క రుషికొండ బీచ్‌లో మాత్రమే కాదు.. విశాఖలో రామకృష్ణా బీచ్, తెన్నేటి పార్క్ వద్ద బీచ్, సాగర్ నగర్‌ బీచ్ పాయింట్, భీమిలి బీచ్ ప్రతీ చోటా ఇదే పరిస్థితి.

నగరంలో రామకృష్ణ బీచ్ చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడ అందరూ తిరిగే చోటే నగరంలో మురికినీళ్ళు సముద్రంలో కలుస్తూంటాయి. ఆ నీటిలోనే పర్యాటకులు జలకాలు ఆడుతుంటారు. ఏటా విశాఖ సముద్రతీరం కోతకు గురవుతూనే ఉంది. కానీ ఎవరూ పట్టించుకోరు.

కనుక ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ బీచ్‌లన్నిటినీ చక్కడిద్దగలిగితే ప్రజలు, పర్యాటకులు చాలా సంతోషిస్తారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నింగిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌, నేలపై ఆర్టీసీ డ్రైవర్ శివ!

ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ కాక్‌పిట్‌లో కత్తితో దాడి చేస్తున్నప్పుడు ఓ పక్క అతని కత్తిపోట్లు ఎదుర్కొంటూనే…

11 minutes ago

నా కుట్రలు ఫలించాయి కూటమి విచ్చినం అయ్యింది!

జీవిత చరిత్రలు వ్రాసుకునే ప్రముఖులు తమ గొప్పలు చెప్పుకోవడానికే ఇష్టపడతారు తప్ప చేసిన తప్పులు, అసమర్ధత గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు.…

38 minutes ago