
మొదట విలాసాలకే జీఎస్టీ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుండి మళ్లీ పడుకునే వరకూ ఏదో ఒక రూపంలో ప్రజల నుండి స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అంటూ వసూలు చేస్తోంది.
ఇక తాజాగా మన దేశంలో ఏ రేంజ్ లో జీఎస్టీ వసూలు చేస్తున్నారో అర్థం అయ్యేలా ఓ బిల్లు వైరల్ అవుతోంది. పూరి ముంబై ఎల్ టీ టీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఓ వ్యక్తి ప్రయాణించాడు. అతడికి ఆకలి వేయడం తో ప్రయాణం మధ్యలో రూ. 1025 విలువ చేసే ఫుడ్ ను ఐఆర్సీటీసీలో ఆర్డర్ చేశాడు. కాగా ఆ ఫుడ్ కు రూ. 660 రూపాయల జీఎస్టీ వసూలు చేశారు. అంతే దాదాపు 65 శాతం జీఎస్టీ పడింది. బిల్లు చూసిన తరవాత ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.
ఆ బిల్లును ఫోటో తీసి రైల్వే అధికారులకు, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ బిల్లు మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో అసలు బిల్లు కంటే జీఎస్టీ నే ఎక్కువ వేశారు కదా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయినా తినే ఫుడ్ పై కూడా జీఎస్టీ ఏంటి..? అంటూ కేంద్ర ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
Ranbir Kapoor and Yash starrer mythological film Ramayana Part 1 will be hitting the screens…
Mitchell Starc's participation in IPL 2027 remains uncertain as Australia prepare for a demanding international…