Telugu

74 ఏళ్ళ యువకుడితో 52 ఏళ్ళ వృద్ధుడు పోటీ!

యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్‌పై అనేక విష ప్రయోగాలు చేసింది. అవి వికటించడంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

ఆ తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు ఓ నిర్ధిష్టమైన ప్రణాళికతో అమరావతికి శ్రీకారం చుట్టారు. దానిని జగన్‌ కొనసాగించి ఉండి ఉంటే ఆయనకు ఏపీ ప్రజల మనసుల్లో, ఏపీ చరిత్రలో గొప్ప స్థానం లభించి ఉండేది. కానీ ఆయన కూడా మూడు రాజధానులు, అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాలతో మరో విష ప్రయోగాలు చేశారు. అవి వికటించడంతో వైసీపీ కూడా తుడిచిపెట్టుకు పోయింది.

ADVERTISEMENT

కనుక రాజకీయ పార్టీలు తమ సొంత అజెండాతో పని చేయడం వలన నష్టపోతాయని, కనుక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.

సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తోందని, ఈ 10 నెలలో జరిగిన, ఇంకా జరుగుతున్న అభివృద్ధి పనులు సూచిస్తున్నాయి. రాబోయే మూడేళ్ళలో అమరావతి, పోలవరం, మెట్రో మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని పట్టుదలగా ఉన్నారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతూ వారికి మేలు చేశానని చెప్పుకునేవారు. పైగా జగన్‌ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే సంక్షేమ పధకాలు ఆపకుండా కొనసాగించేవాడినని చెప్పుకుంటున్నారంటే అర్దం ఇంకా ఎన్నేళ్ళపాటు సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచినా ప్రయోజనం ఉండదనే కదా?ఒకవేళ సంక్షేమ పధకాలతోనే పేదలకు నిజంగా మేలు కలిగి ఉంటే మళ్ళీ సంక్షేమ పధకాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండేది కాదు కదా?

కానీ సిఎం చంద్రబాబు నాయుడు అందరికీ చదువు, ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ఎవరి కాళ్ళపై వారు నిలబడేలా చేయాలనుకుంటారు. అందుకే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రప్పించి వాటిలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఉద్యోగాలకు తగిన అర్హత, నైపుణ్యం కోసం యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయిస్తుంటారు.

సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవిదంగా చేయడం వలననే ఆనాడు లక్షల మంది యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డారు. ఈ విషయం వారే స్వయంగా చెప్పుకుంటారు కూడా. కనుక చంద్రబాబు నాయుడు విధానం సరైనదని నిరూపించబడింది కూడా. కానీ ఆయన అంతటితో ఆగిపోకుండా యువతకు మరిన్ని కొత్త కొత్త అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సరైన మార్గంలోనే పయనిస్తోందని అర్దమవుతూనే ఉంది. కనుక వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ కూటమినే గెలిపించడం ఖాయమే అని భావించవచ్చు.

మరి జగన్‌ ఈ విషయం గుర్తించారా?అంటే లేదనే భావించాల్సి ఉంటుంది. నేటికీ ఆయన చంద్రబాబు నాయుడుపై బురద జల్లుతూ రాజకీయం చేయడం అంటే ఇదే అని అనుకుంటున్నారు. పార్టీలో అందరినీ కూడా ఆ బురదలోనే నడిపిస్తున్నారు.

జగన్‌ కనీసం ప్రజల మద్యకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఓ ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యత నెరవేరుస్తున్నారని ప్రజలు భావించేవారు. కానీ అటు శాసనసభకు వెళ్ళకుండా, ఇటు ప్రజల మద్యకు వెళ్ళకుండా తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని బురద రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు!

ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు ఇంత వేగంగా దూసుకుపోతుంటే, యువకుడైన జగన్‌ బురద, శవ రాజకీయాలు చేస్తుంటే వచ్చే ఎన్నికలలో ఒక్క సీటు అయినా వస్తుందా?వైసీపీ నేతలే చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

8 minutes ago

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

37 minutes ago