ఓ కార్యక్రమానికి వెళ్లి జయపుర మీదుగా తిరిగి ప్రయాణిస్తోన్న బాలీవుడ్ నటుడు జీతూవర్మపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ‘సోల్జర్, సన్ ఆఫ్ సర్దార్, బోల్ బచ్చన్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జీతూవర్మ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడి ఎందుకు జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ADVERTISEMENT
గాయపడిన జీతూని ముంబయి ఆసుపత్రికి తరలించిన ఆయన సోదరుడు మనోహర్ చికిత్స అందిస్తున్నారు. ఆ రాళ్ల దాడిలో జీతూ కన్ను బాగా దెబ్బతిందని డాక్టర్లు తెలిపారు. జీతూవర్మ కంటిచూపు సరిగా కనిపిస్తుందో లేదో చెప్పలేమని డాక్టర్లు పేర్కొనడంతో, జరిగింది చిన్న దాడి కాదని అవగతమవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ADVERTISEMENT



