పవన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు!

Bheemla Nayak Pawan Kalyan - Rana Daggubatiజనవరి 7వ తేదీన “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, “భీమ్లా నాయక్” వాయిదా అనివార్యం కాబోతోందని, ఈ విషయమై స్వయంగా రాజమౌళి పవర్ స్టార్ తో మాట్లాడినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అనధికారికంగా వెలువడిన ఈ వార్తలను పక్కన పెడితే, జనవరి 12వ తేదీన “భీమ్లా నాయక్” పక్కా అని మరోసారి ధ్రువీకరణ చేసారు. తాజాగా ‘అడవి తల్లి మాట’ పేరుతో ఈ సినిమాలోని 4వ లిరికల్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

తెలంగాణ యాసలో సాగిన ఈ పాట జానపద గేయం మాదిరి రెండున్నర్ర నిముషాలే ఉంది. పవన్ – రానాల నడుమ తలెత్తిన ‘ఈగో’ నేపథ్యంలో ఈ పాటను ఆలపించినట్లుగా సాహిత్యం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఊపులో థమన్ మరోసారి తన మ్యూజికల్ పవర్ చూపించారు.

ఈ పాట ద్వారా “భీమ్లా నాయక్” జనవరి 12వ తేదీన విడుదల కాబోతోందని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసింది. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఎలాంటి వాయిదా ట్విస్ట్ లకు తావు లేకుండా ‘భీమ్లా నాయక్’ సిద్ధమవుతోందన్న మాట.

ADVERTISEMENT
Latest Stories