రవిబాబు దర్శకత్వం వహించిన “అదుగో” సినిమా ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను పలకరించింది. బంటి పేరుతో పందిపిల్లతో ‘సిట్ అండ్ స్టాండ్’ మాదిరి రూపొందించిన ఈ టీజర్ తో సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేకపోగా, ఈ టీజర్ లో ఉన్న సెట్ ప్రాపర్టీస్ అన్నీ గ్రాఫిక్స్ గా తేలిపోవడంతో, చిత్రంలోని గ్రాఫిక్స్ నాణ్యతను ప్రశ్నించేలా చేసింది.
అయినా ఫస్ట్ టీజర్ ను ఇంత పేలవంగా కట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో రవిబాబుకే తెలియాలి. బహుశా ఇప్పటివరకు రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల ఫస్ట్ టీజర్లలో బాగా వీక్ అనిపించేలా ఈ ‘అదుగో’ టీజర్ నిలిచింది. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోయే ట్రైలర్ తో చిత్ర ఫేట్ ను నిర్ణయిస్తుందేమో చూడాలి.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



