Telugu

స్కోర్ కార్డ్: 3/3, నెక్స్ట్ హీరో తెలుగు అయితే?

100% సక్సెస్ రేట్ అనేది రేర్ అయిపోతున్న తరుణంలో.. తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడమే కాకుండా, జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించడం, డిస్కషన్ టాపిక్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఘనత సాధించిన దర్శకుడు “ఆదిత్య ధర్”.

నిజానికి “ఉరి”తో డెబ్యూ అనంతరం “ఇమ్మోర్టల్ అశ్వద్ధామ” అనే చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిద్దాం అనుకున్నాడు ఆదిత్య. అయితే.. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్స్ దొరక్కపోవడంతో.. స్వీయ నిర్మాణ సారథ్యంలో “దురంధర్” మొదలుపెట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన “దురంధర్” బాలీవుడ్ కి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే, భారీ అంచనాల నడుమ విడుదలైన “దురంధర్ 2” షాక్ ఇచ్చింది.

ADVERTISEMENT

ఆల్రెడీ “ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్” రికార్డులని బ్రేక్ చేసి, ఇప్పుడు బాహుబలి కలెక్షన్స్ ను బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది.

అయితే.. ఇంతటి సెన్సేషనల్ హిట్ సాధించిన “దురంధర్ 2” గురించి బాలీవుడ్ బడా హీరోలు ఎవరూ కనీసం ట్వీట్ కూడా వేయలేదు. అయితే.. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుసబెట్టి ట్వీట్లు వేయడమే కాక, ఆదిత్య ధర్ కి పర్సనల్ మెసేజులు, ఫోన్లు కూడా చేసి అభినందించారు.

ఈ క్రమంలో ఆదిత్య ధర్ తదుపరి చిత్రం తెలుగు హీరోతో ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినవస్తున్నాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలందరూ ఆదిత్య ధర్ తో సినిమా చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ఆదిత్య ధర్ గనుక తెలుగు హీరోతో ఇండియన్ ఫిలిం తీసినా, లేక తన డ్రీమ్ ప్రాజెక్ట్ “ఇమ్మార్టల్ అశ్వద్ధామ”ను తెలుగు హీరోతో తెరకెక్కించినా ఆ సినిమా స్థాయి, దాని క్రేజ్ ఎలా ఉండబోతాయి అనేది ఎవ్వరూ ఊహించలేరు.

మరి ఆదిత్య ధర్ తన 4వ సినిమాని తనను విశేషంగా ఆదరించిన తెలుగు హీరోలతో చేస్తాడా? లేక తనను కనీసం పట్టించుకొని బాలీవుడ్ లోనే చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

PVR Cinemas Hit with Penalty: Movie Ads Going Too Far?

The District Consumer Disputes Redressal Commission-II, Hyderabad, has held PVR Cinemas and PVR Inox Ltd.…

6 minutes ago

AI డీప్ ఫేక్ ఎబ్యూజ్: ఎన్టీఆర్ ఒక్కడు బాధ్యత తీసుకుంటే సరిపోదు

ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ చుట్టమల్లే పాట డీప్ ఫేక్ AI వీడియో గురించి చాలా సీరియస్ అవుతూ ఒక…

17 minutes ago