మేజర్… మంచి మాట చెప్పారు

Major The Filmయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ తరువాతి ప్రాజెక్టు ‘మేజర్’ … 2008 లో ముంబై మీద జరిగిన ఉగ్రదాడిలో వీర మరణానం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ గారి జీవిత చరిత్రపై పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్న చిత్రం. ఆ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ ఈరోజు ఉగ్రదాడి అన్నివేర్సరీ సందర్భంగా విడుదల చేశారు.

ADVERTISEMENT

గతంలో ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో చాలా సినిమాలు తీశారు. కొన్ని వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి. అయితే మేము ఈ సినిమాలో మేజర్ ఉన్ని కృష్ణన్ ఎలా మరణించారు అనేది చెప్పబోవడం లేదని.. ఆయన ఎలా బ్రతికారో చెపుతామని అడివి శేష్ చెప్పుకొచ్చారు. ఇది కచ్చితంగా మంచి నిర్ణయం అనే చెప్పుకోవాలి.

ఈ సినిమాలో శేష్ లుక్ రివీల్ చేసింది మాత్రం సూపర్బ్ గా ప్లాన్ చేసారని చెప్పాలి. సందీప్ గారి పక్కన శేష్ ఫోటో హాఫ్ ను పెట్టి మరింత ఆసక్తి కలిగించారు. అలాగే ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు మరింత ఇంపాక్ట్ ఇచ్చింది. ఫైనల్ గా మాత్రం “మేజర్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే డిసెంబర్ 17న రివీల్ చెయ్యనున్నారు.

చిత్రంలో శేష్ లుక్ చూసి అచ్చం తన కొడుకు లానే ఉన్నారని మెచ్చుకున్నారట. ఈ సినిమా చెయ్యడానికి మొదట్లో ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. అయితే వారిని బెంగళూరులో కలిసి పది రోజుల పాటు కష్టపడి ఒప్పించారట. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేదాని మీద క్లారిటీ లేదు.

ADVERTISEMENT
Latest Stories