
కేవలం 42 వన్డేల్లోనే 96 వికెట్లు నేలకూల్చిన రషీద్ ఖాన్ వంద వికెట్ల మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మిగతా నాలుగు వికెట్లు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్ రికార్డులకెక్కనున్నాడు.
గతంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 52 వన్డేల్లో 100 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రషీద్ ఈ టోర్నీలో ఇప్పటికే 15 వికెట్లు సాధించగా, వరల్డ్ రికార్డు సృష్టించడానికి ఇంకా చేతిలో 10 మ్యాచ్ లు ఉండగా, రికార్డును సాధించడానికి కేవలం 4 వికెట్ల దూరంలో ఉండడంతో, ప్రపంచ రికార్డు రషీద్ సొంతం కావడం ఖాయం.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…