Telugu

ప్రతి సీనూ క్లైమాక్స్ ఏ..!

తాజాగా ముగిసిన టీ 20 వరల్డ్ కప్ సూపర్ 8 ముగవగా, ఎవరు ఊహించని విధంగా ఆఫ్ఘానిస్తాన్ సెమీస్ కు దూసుకెళ్లారు. నేడు బాంగ్లాదేశ్ తో జరిగిన హోరా హోరి పోరులో ఆఫ్ఘన్ జట్టు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పోరాడుతూ విజయం కైవసం చేసుకున్నారు. ఆఫ్ఘన్ గెలుపు ఆస్ట్రేలియా జట్టును ఇంటికే పరిమితం చేసింది.

రెండు వారాల ముందు, ఇదే ఆసీస్ జట్టు ఇంగ్లాండ్ సూపర్ 8 లోకి రాకపోవటం మాకు మంచిది అనగా, నేడు ఇంగ్లాండ్ జట్టు సెమిస్ కు అర్హత సాధించగా ఆస్ట్రేలియా జట్టు ఇంటి దారి పట్టింది. అలాగే ఆఫ్ఘన్ జట్టు ఈ నెల 23 న ఆస్ట్రేలియాతో తలపడగా, అనూహ్యంగా వారు ఆస్ట్రేలియా జట్టు పైనే విజయ కేతనాన్ని ఎగరేశారు.

ADVERTISEMENT

ఆ తరువాత జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోవటం ఆఫ్ఘన్ వారికి మరింత మేలు చేసింది. ఆఫ్ఘన్ మొట్ట మొదటిసారిగా ఒక ఐసిసి ఈవెంట్ లో సెమిస్ కు అర్హత సాధించింది. గత ఏడాది ఇండియా లో జరిగిన వరల్డ్ కప్ లో సైతం వారు సెమీస్ కు వెళ్లే అంత పని చేసారు. కానీ అత్యవసర మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టు, వారిని సెమీస్ కు దూరం చేసింది.

అయితే, ఈసారి ఆఫ్ఘన్ జట్టు అదే సౌత్ ఆఫ్రికా జట్టు పై తమ మొదటి సెమీస్ లో తలపడబోతున్నారు. బహుశా ఇదే దేవుడి స్క్రిప్ట్ ఏమో..? గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఈసారి వరల్డ్ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేదు. పైగా మన టీం ఇండియా నే వారిని సగం ఇంటి దారి పట్టించటం తో టీం ఇండియా ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

అయితే అంతిమ సంస్కారాలు మటికి ఆఫ్ఘన్ వారు దగ్గరుండి చేయించారు. ఆ విషయంగా ఆఫ్ఘన్ వారు ఆస్ట్రేలియా ను సైలెంట్ చేసారు అంటూ ఫాన్స్ సోషల్ మీడియా లో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆఫ్ఘన్ మరియు సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటివరకు ఫైనల్ మొకాన్ని చూడలేదు,అయితే సెమీస్ లో గెలిచినా జట్టు ఫైనల్స్ కి చేరి మొదట ఫైనల్స్ గా నిలుస్తుంది.

అయితే సెమీస్ రాతను మార్చిన ఆఫ్ఘన్ vs బాంగ్లాదేశ్ మ్యాచ్ మొదటి నుండే హోరా హోరీగా సాగింది, నరాలు తెగేంత ఉత్కంఠ తో అభిమానులు, టన్నుల కొద్ది ఒత్తిడి తో ఆటగాళ్లు ఆడారు. చివరికి ఆఫ్ఘన్ పోరాట పటిమ కు వారికి తగిన ఫలితం లభించింది అనేది క్రికెట్ పండితుల మాట. ఈ సిరీస్ లో ఆఫ్ఘన్ లా ఆట ప్రతీ సీనూ క్లైమాక్స్ వలె ఉందంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

తాజాగా ముగిసిన టీ 20 వరల్డ్ కప్ సూపర్ 8 ముగవగా, ఎవరు ఊహించని విధంగా ఆఫ్ఘానిస్తాన్ సెమీస్ కు దూసుకెళ్లారు. నేడు బాంగ్లాదేశ్ తో జరిగిన హోరా హోరి పోరులో ఆఫ్ఘన్ జట్టు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పోరాడుతూ విజయం కైవసం చేసుకున్నారు. ఆఫ్ఘన్ గెలుపు ఆస్ట్రేలియా జట్టును ఇంటికే పరిమితం చేసింది.

రెండు వారాల ముందు, ఇదే ఆసీస్ జట్టు ఇంగ్లాండ్ సూపర్ 8 లోకి రాకపోవటం మాకు మంచిది అనగా, నేడు ఇంగ్లాండ్ జట్టు సెమిస్ కు అర్హత సాధించగా ఆస్ట్రేలియా జట్టు ఇంటి దారి పట్టింది. అలాగే ఆఫ్ఘన్ జట్టు ఈ నెల 23 న ఆస్ట్రేలియాతో తలపడగా,
అనూహ్యంగా వారు ఆస్ట్రేలియా జట్టు పైనే విజయ కేతనాన్ని ఎగరేశారు.

ఆ తరువాత జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోవటం ఆఫ్ఘన్ వారికి మరింత మేలు చేసింది. ఆఫ్ఘన్ మొట్ట మొదటిసారిగా ఒక ఐసిసి ఈవెంట్ లో సెమిస్ కు అర్హత సాధించింది. గత ఏడాది ఇండియా లో జరిగిన వరల్డ్ కప్ లో సైతం వారు సెమీస్ కు వెళ్లే అంత పని చేసారు. కానీ అత్యవసర మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా జట్టు, వారిని సెమీస్ కు దూరం చేసింది.

అయితే, ఈసారి ఆఫ్ఘన్ జట్టు అదే సౌత్ ఆఫ్రికా జట్టు పై తమ మొదటి సెమీస్ లో తలపడబోతున్నారు. బహుశా ఇదే దేవుడి స్క్రిప్ట్ ఏమో..? గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఈసారి వరల్డ్ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేదు. పైగా మన టీం ఇండియా నే వారిని సగం ఇంటి దారి పట్టించటం తో టీం ఇండియా ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

అయితే అంతిమ సంస్కారాలు మటికి ఆఫ్ఘన్ వారు దగ్గరుండి చేయించారు. ఆ విషయంగా ఆఫ్ఘన్ వారు ఆస్ట్రేలియా ను సైలెంట్ చేసారు అంటూ ఫాన్స్ సోషల్ మీడియా లో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆఫ్ఘన్ మరియు సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటివరకు ఫైనల్ మొకాన్ని చూడలేదు,అయితే సెమీస్ లో గెలిచినా జట్టు ఫైనల్స్ కి చేరి మొదట ఫైనల్స్ గా నిలుస్తుంది.

అయితే సెమీస్ రాతను మార్చిన ఆఫ్ఘన్ vs బాంగ్లాదేశ్ మ్యాచ్ మొదటి నుండే హోరా హోరీగా సాగింది, నరాలు తెగేంత ఉత్కంఠ తో అభిమానులు, టన్నుల కొద్ది ఒత్తిడి తో ఆటగాళ్లు ఆడారు. చివరికి ఆఫ్ఘన్ పోరాట పటిమ కు వారికి తగిన ఫలితం లభించింది అనేది క్రికెట్ పండితుల మాట. ఈ సిరీస్ లో ఆఫ్ఘన్ లా ఆట ప్రతీ సీనూ క్లైమాక్స్ వలె ఉందంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Big Collections, No Profits? Ugly Truth Behind Box Office

There is a common misconception about movie collection figures. Fans often add GST to box-office…

9 minutes ago

Don’t Sleep Teaser: A Psychological Thriller

  Cinematographer Shamdat is making his Telugu directorial debut with the psychological thriller Don’t Sleep,…

11 minutes ago