
అయితే రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ఇప్పటికే ప్రారంభించారు దర్శకుడు సుకుమార్. సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కలిసి లోకేషన్ల కోసం అన్వేషణ సాగిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సుక్కూ సినిమాలకు ఫోటోగ్రఫీ బాధ్యతలను రత్నవేలు తప్ప మరొకరు చేపట్టరన్న విషయం, ఈ సినిమాతో మరోసారి రుజువవుతోంది.
గ్రామీణ వాతావరణం నేపధ్యంలో సాగే కధ కావడంతో… ఉభయ గోదావరి జిల్లాలలో ఈ సినిమా షూటింగ్ జరిపే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే తమిళనాడు, కేరళలోనూ లొకేషన్లను ఎంపిక చేయనున్నట్లుగా సమాచారం. జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ నిర్మాతలు ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…