టిల్లు స్క్వేర్ సెప్టెంబర్ కి వాయిదా పడటంతో ఆగష్టు 11న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది. అయితే అనిల్ సుంకర నిర్మాత కావడంతో భోళా శంకర్ కు కొత్త ప్రాబ్లం వచ్చిపడింది.
అనిల్ సుంకర తాజా చిత్రం ‘ఏజెంట్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఆ సినిమా ను ఉత్తరాంధ్రకు చెందిన ‘గాయత్రీ’ సతీష్ ఏపీ, తెలంగాణ రైట్స్ హోల్ సేల్ గా 30 కోట్లకు కోవిడ్ కు ముందే ఇచ్చేశారు అనిల్. 30 కోట్ల మీద జీఎస్టీ బాధ్యతకూడా బయర్ దే.
అప్పటి అఖిల్ మార్కెట్ కి, ఆ సినిమాకు మంచి రేటే. అయితే కోవిడ్ వల్ల సినిమా డిలే కావడం, అలాగే మేకింగ్ కు ఎక్కువ పెట్టాల్సి రావడం తో బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. అలానే… కోవిడ్ కు ముందే నాన్ – థియేట్రికల్ రైట్స్ కూడా అమ్మేశారు.
కోవిడ్ తరువాత వచ్చిన ఓటీటీ బూమ్ వల్ల కూడా నిర్మాత లాభపడింది లేదు. అదే సమయం బడ్జెట్ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ కూడా చెయ్యలేదు. ఆ కారణంగా నిర్మాతకు టేబుల్ లాస్. అఖిల్ – సురేందర్ రెడ్డి – స్పై సినిమా కు టేబుల్ లాస్ అంటే నిర్మాత పరిస్థితి కి కూడా జాలి పడాల్సిందే.
ఇక సినిమా విడుదల తరువాతి సంగతికి వద్దాం… సినిమా డిజాస్టర్ అయ్యింది. ‘గాయత్రీ’ సతీష్ 25 కోట్లు పోయాయి నాకు కాబట్టి… ఏకంగా 15 కోట్లు కంపెన్సషన్ అడుగుతున్నారు. మూడో నాలుగో అయితే నిర్మాత గుడ్ విల్ కోసం కిందా మీదా పడే వాడు… అయితే 15 కోట్లు అనడం తో ఆ డిస్కషన్ ముందుకు వెళ్ళలేదు.
భోళా శంకర్ ఉత్తరాంధ్ర హక్కులు కావాలని అడిగినా ఇవ్వకుండా విఘ్నేశ్వర ఫిల్మ్స్ కు ఇచ్చారని కంప్లయింట్. ఏజెంట్ బయర్ కు నిర్మాత హ్యాండ్ ఇచ్చారంటూ ప్రచారం చేసుకోవడం తో నిర్మాత కూడా అసహనంగా ఉన్నారు.
‘గాయత్రీ’ సతీష్ తో 30 కోట్లకు అగ్రిమెంట్ నాన్ రికవరబుల్ అడ్వాన్స్ పద్దతిన చేసుకున్నారు అనిల్ సుంకర… కాబట్టి లీగల్ గా ఎటువంటి బాధ్యతా ఉండదు. అయితే మోరల్ గా కొంత సర్దుబాటు చెయ్యడం పరిపాటే. మొన్న లైగర్ విషయంలో జరిగింది కూడా అదే.
అయితే ఇక్కడ కూడా ఒక తకరారు ఉంది. 30 కోట్లకు గానూ సతీష్ రిలీజ్ ముందు కట్టింది 26 కోట్లే… అగ్రిమెంట్ ప్రకారం జీఎస్టీ బాధ్యత కూడా ఆయనదే అయినా కట్టలేదు. ఇప్పుడు అది కూడా అనిల్ సుంకర కట్టుకోవాల్సిందే.
సరే ఒక వేళ ‘భోళా శంకర్’ ఉత్తరాంధ్ర రైట్స్ ఇస్తే డబ్బులు పూర్తిగా కట్టకపోతే నిర్మాత ఎవరికి చెప్పుకోవాలి?
ఇక్కడ మరో విషయం కూడా ఉంది… సహజంగా పెద్ద సినిమాలలో నిర్మాతలు రిలీజ్ కు ముందే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మీద డబ్బులు చేసుకుంటారు కాబట్టి నష్టం వస్తే ఎంతో కొంత సర్దుబాటు చెయ్యాల్సిన బాధ్యత ఉంటుంది.
అయితే పైన చెప్పుకున్న కారణాల వల్ల నిర్మాత 23 కోట్ల డెఫిషిట్ తో రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది.
ఒక వేళ ఏజెంట్ అనే సినిమా హిట్ అయ్యుంటే… 30 కోట్ల డీల్ కాబట్టి బయర్ భారీగా లాభాలు ఆర్జించేవాడు… ఎన్ఆర్ఏ డీల్ లో బ్రేక్ ఈవెన్ తరువాత వచ్చే 20% తో కూడా నిర్మాతకు సేఫ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ సినిమా బావుంటే బయర్ మాత్రం భారీ గా లాభాలు చూసేవాడు.
ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి హిట్ అవుతుంది అనే నమ్మకం తోనే ‘గాయత్రీ’ సతీష్ నైజాం హక్కులు 9 కోట్లకు అడిగినా ఇవ్వకుండా కమిషన్ లెక్కన దిల్ రాజు ద్వారా రిలీజ్ చేసుకున్నారు. అయితే రిలీజ్ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
ఏది ఏమైనా ఏజెంట్ ఒక చిత్రమైన పరిస్థితి అని చెప్పుకోవాల్సిందే… ఛాంబర్, కౌన్సిల్ దాకా వెళ్లినా దీనికి పరిష్కారం అనేది కష్టమనే చెప్పుకోవాలి.



