
అవును… ఏ పెద్ద సినిమా ఆడియో రిలీజ్ అంటే… సిట్యూయేషన్ తో సంబంధం లేకుండా హీరోలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ… ఫైనల్ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసి, అభిమానుల్లో అప్పటివరకు ఉన్న అంచనాలను పెంచేస్తారు. ఒక విధంగా ఆడియో రిలీజ్ కంటే కూడా ప్రేక్షకులంతా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని వేచిచూసే పరిస్థితి నెలకొంటుంది.
కానీ “అజ్ఞాతవాసి” విషయంలో అలా జరగబోవడం లేదు. పవన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే విధంగా అనిరుధ్ స్వరపరచిన ఆడియో రిలీజ్ వేడుక పైన ధియేటిరికల్ ట్రైలర్ ప్రదర్శించబోవడం లేదని ముందుగానే సమాచారం బయటకు వచ్చింది. మరి అభిమానులంతా ఎదురుచూస్తోన్న ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? అంటే… దానికి కూడా సమాచారం ఉంది.
విడుదలకు మరో 15 రోజుల సమయం ఉందనగా… అంటే డిసెంబర్ 26వ తేదీన అజ్ఞాతవాసి” ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది. మరి నేడు స్టేజ్ పైన ఏం చూపించబోతున్నారు? అంటే… మేకింగ్ వీడియోలతో పాటు ఈ సినిమాలోని పాటల టీజర్స్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం కట్ చేసి సిద్ధంగా పెట్టారు. వాటితో సరిపెట్టుకోవడమే..!
భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…