ఆ సినిమాల రిజల్ట్ తో ట్రేండింగ్ లో “అ…ఆ..!”

సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన హనుమాన్, గుంటూరు కారం సినిమాలతో అజ్ఞాతవాసి….ఆదిపురుష్ సినిమాలు ట్రెండింగ్ లోకి వచ్చాయి. 2018 సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అజ్ఞాతవాసి రూపంలో మరిచిపోలేని డిసాస్టర్ అందించిన గురూజీ ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను టార్గెట్ చేసినట్టుగా గుంటూరు కారం తో వచ్చారు.

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు పెద్దతెర మీద ఆశించిన విజయాన్ని, భారీ కలెక్షన్ లను అందిపుచ్చుకోలేనప్పటికీ బుల్లితెర మీద మాత్రం ఇప్పటికి తన హవా కొనసాగించడంతో ఈసారి వచ్చే ఈ ఇద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ తాటతీస్తుంది అని ఆశించిన మహేష్ అభిమానులకు ఊహించని ఘాటైన షాక్ ఇచ్చారు గురూజీ.

ADVERTISEMENT

అతడు, ఖలేజా తో మహేష్ నటనలో పార్థు, రాజు లతో ఓ కొత్తదనాన్ని చూపించిన త్రివిక్రమ్ ఈసారి ‘రమణ’ గాడితో మహేష్ మాస్ లుక్ ను పరిచయం చేయబోతున్నారనే ఆశతో థియేటర్లకు వచ్చిన గుంటూరు కారం ఆడియన్స్ కు గురూజీ గొడ్డుకారం పెట్టారు అనేలా సినిమాను తెరకెక్కించారు. మూస కథ కథనంతో, ఆసక్తి లేని కామెడీ టైమింగ్ తో, ఎందుకు వస్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో అర్థంకాని పాటలు – ఫైట్లతో ఎప్పుడైపోతుందో అన్న ఆశతో ధియేటర్ల నుండి బయటకు వస్తున్నారు ప్రేక్షకులు.

అజ్ఞాతవాసి సినిమాతో కొన్నాళ్ళు పవన్ అభిమానులను అజ్ఞాతంలోకి తీసుకెళ్లిన గురూజీ ఇప్పుడు గుంటూరు కారంతో మహేష్ అభిమానుల కళ్ళలో కారం కొట్టారు అంటూ పవన్ అభిమానులు మహేష్ అభిమానులను ఓదారుస్తున్నారు. ఇలా గురూజీ మాకొకటి మీకొకటి సంక్రాంతి కానుక ఇచ్చారు అంటూ ఒకరి బాధను మరొకరు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దీనితో గుంటూరు కారంతో ఒక్కసారిగా ‘అజ్ఞాతవాసి’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇదిలా ఉంటే మరో పక్క హిట్ కొట్టిన ‘హనుమాన్’ సినిమా కూడా మరో సినిమాను ట్రేండింగ్ లో ఉంచింది. సుమారు 500 కోట్లకు పైబడిన బడ్జెట్ తో ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ను హీరోగా ఎంచుకుని భారీ తారాగణాన్ని నమ్ముకుని తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ సినిమా అటు ప్రభాస్ అభిమానులతో పాటుగా ఇటు హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసేలా ఉందన్న విమర్శలను మూటకట్టుకుంది.

దాదాపు 50 కోట్ల బడ్జెట్, చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ కి వచ్చి హీరోగా రెండు, మూడు సినిమాలలో నటించిన తేజ సజ్జ ను పెట్టుకొని ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ థియేటర్లలలో “జై హనుమాన్” అంటూ రచ్చలేపుతుంది. తన కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో, స్టార్ కటౌట్స్ కు భయపడకుండా వెనుకడుగు వేయని ప్రశాంత్ వర్మ టాలెంట్ కు యావత్ సినీ ప్రపంచం సలాం చేస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ సినిమా కూడా ప్రశాంత్ వర్మ తెరక్కెక్కించినట్లయితే ఆ సినిమా రిజల్ట్ ఏస్థాయిలో ఉండేదో ఊహకు కూడా అందదు అంటూ ప్రశాంత్ వర్మను ఆకాశానికెత్తేస్తున్నారు.

గుంటూరు కారం, సైన్ధవః, నాసామి రంగ వంటి స్టార్ హీరోల సినిమాలతో కలిసి వచ్చినప్పటికీ ఇప్పటికే మహేష్, వెంకటేష్ సినిమాలు మిక్సడ్ టాక్ తెచ్చుకోవడంతో రానున్న రోజులలో హనుమాన్ సందడి మరింత పెరగనుందని తెలుస్తుంది. వందల కోట్ల బడ్జెట్, సినిమాలో హీరో నుంచి దర్శకుడి వరకు ఏ ఒక్కరికి స్టార్ స్టేటస్ లేనప్పటికీ కథనే స్టార్ గా నమ్మి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తే వచ్చే ఫలితమేమిటో హనుమన్ సినిమాతో ప్రశాంత్ వర్మ నిరూపించారంటూ ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓంరౌట్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సినీ అభిమానులు.

ఇలా “ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్నట్టు” గుంటూరు కారం, హనుమాన్ సినిమాల రిజల్ట్ తో అజ్ఞాతవాసి, ఆదిపురుష్ సినిమాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ గురూజీని, ఓంరౌట్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనితో ట్రేండింగ్ లో “అ…ఆ…”ఇలా పక్కపక్కనే ఉండే రెండక్షరాలు ట్రెండ్ అవ్వడానికి “గు…హ…”సినిమాలు విడుదల కావలసి వచ్చిందన్నమాట.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

విశాఖ మేయర్ పీఠం.. ఆ జనరల్ మహిళ ఎవరు?

విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ…

31 minutes ago

After A Big Break, Vallabhaneni Vamsi Is Back?

Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…

1 hour ago