Telugu

విశాఖ మేయర్ పీఠం.. ఆ జనరల్ మహిళ ఎవరు?

విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని పేరు ప్రచారంలోకి రావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఆమెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించేందుకే ఈ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేసిందా? అనే చర్చ మొదలైంది.

అసలు ఆమె నిజంగానే ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనుకుంటున్నారా? లేదా?అనే విషయం పక్కన పెడితే, ఆమె విశాఖ ఎంపీ భరత్ భార్య కావడం, నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ చర్చకు ఆస్కారం ఏర్పడింది.

ADVERTISEMENT

ఒకవేళ ఆమెను టీడీపి బరిలో దింపితే మిత్ర పక్షాలు పక్కకు తప్పుకొని ఆమెకు స్వాగతం పలుకుతాయా? లేక ఈ స్థానిక అవకాశాన్ని చేజార్చుకుంటే మరో అవకాశం రాకపోవచ్చు కనుక జనసేన, బిజేపి కూడా ఈ రేసులో దిగుతాయా? అనేది బహుశః ఒకటి రెండు రోజులలో తేలిపోతుంది.

విశాఖ మేయర్ కేవలం ఓ పదవి మాత్రమే కాదు. విశాఖలో బలంగా ఉన్న వైసీపీకి అడ్డుకట్ట వేసేందుకు, ఇది ఒక బలమైన ఆయుధం వంటిది. కనుక ఇక్కడ టీడీపి, జనసేన, బిజేపి అని కాకుండా మూడు పార్టీలలో అటువంటి బలమైన అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలనేది కీలకం. ఈ పదవి, విజయం ప్రభావం అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వరకు ఉంటుంది.

ఏవిధంగా అంటే, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ భీమిలి, విశాఖ వరకు తన కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇప్పుడు కూడా వైసీపీలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లేదా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిలలో ఎవరో ఒకరిని బరిలో దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ‘చిన్న శ్రీను’తో బొత్సకుటుంబానికి, జిల్లా వైసీపీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సి ఉంటుంది.

కనుక విశాఖ నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి ఈ పదవి ఇస్తే ఆమెను గెలిపించుకునే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటారు. కనుక ఆమెకు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. కనుక విశాఖలో బొత్సను, వైసీపీని అడ్డుకోగలిగితే, విజయనగరం జిల్లాలో కూడా ఆయనను ఢీ కొట్టి ఓడించగల అవకాశం పెరుగుతుంది.

కానీ విశాఖతో సహా రాష్ట్రంలో అన్ని మేయర్, మున్సిపల్ చైర్మన్‌ పదవులకు ఇంచుమించు ఇదే వర్తిస్తుంది. కనుక ఈ పదవులు కేవలం పదవులు మాత్రమే కావు. భవిష్యత్‌ రాజకీయ పరిణామాలలకు ఇది పునాది వంటివి. ఈ విషయం వైసీపీకి, టీడీపికి బాగా తెలుసు. జనసేన, బిజేపిలు కూడా తెలుసుకుంటే చాలు.. భవిష్యత్‌ లెక్కలు కూడా సమూలంగా మారిపోతాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

After A Big Break, Vallabhaneni Vamsi Is Back?

Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…

41 minutes ago

నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నా రాజకీయాలతోనే కాలక్షేపం!

ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్‌ యుద్ధ పరిణామాలు, హెచ్‌1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై కొత్త ఆంక్షలు.. వీటన్నింటి ప్రభావం అమెరికాతో…

52 minutes ago