ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ చుట్టమల్లే పాట డీప్ ఫేక్ AI వీడియో గురించి చాలా సీరియస్ అవుతూ ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు. ఆ వీడియో సృష్టించిన లేదా సర్క్యులేట్ చేస్తున్న వాళ్లని వదిలిపెట్టనని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దాంతో సోషల్ మీడియా మొత్తం ఈ డీప్ ఫేక్ వీడియోల గురించి డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇదివరకు కూడా చాలామంది హీరోయిన్లు ఈ AI ఫోటోలు, వీడియోల ద్వారా ఎంతగా బాధపడ్డారో చెప్పుకుని బాధపడిన సందర్భాలు, సీరియస్ అయిన సినారియోలు చాలా ఉన్నాయి. కానీ వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
నిజానికి ఈ డీప్ ఫేక్ లు ఇప్పుడు మొదలైనవి కావు, 1990 సంవత్సరం ప్రాంతంలో అమెరికాలో వేశ్య వద్ద నుండి సెక్స్ ని కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక రేప్ సంస్కృతి పెట్రేగిపోతున్న తరుణంలో.. వర్చువల్ సెక్స్ వాడుకలోకి వచ్చింది. మెటా గ్లాసెస్ లాంటివి కళ్ళకి పెట్టుకుని నచ్చిన మోడల్ తో POV సెక్స్ చేసే స్కోప్ అప్పుడే క్రియేట్ అయ్యింది. అప్పట్లో అది కేవలం కొన్ని కంపెనీల ఆధీనంలో ఉండడంతో.. గేమ్ సీడీలు కొనుక్కున్నట్లు సదరు వర్చువల్ ప్లెజర్ కంటెంట్ ని కొనుక్కుని సంతృప్తిపడేవారు జనాలు. ఇండియాలో మాత్రం అది కేవలం మెట్రో సిటీస్ కి మాత్రమే పరిమితమయ్యింది.
అయితే.. 2010 తర్వాత డీప్ ఫేక్ తో అదే వర్చువల్ సెక్స్ వీడియోల్లో మోడల్స్ కి హాలీవుడ్ పాపులర్ హీరోయిన్స్ మోనికా బెల్లుసి, మార్లిన్ మన్రో, డ్రూ బేరీమోర్ వంటి వార్ల మొహాలను రీప్లేస్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది బాలీవుడ్ కి కూడా పాకింది. ప్రీతి జింటా, ఐశ్వర్య రాయ్, కరిష్మా కపూర్ వంటి వాళ్ల వీడియోలు కూడా ముంబై సీడీ షాపుల్లో దర్శనమిచ్చాయి. అప్పట్లో ఆ సీడీలు అమ్మిన, తయారు చేసినవాళ్ళ మీద కేసులు బుక్ చేయడం మొదలుకొని, అరెస్టుల పర్వాలు కూడా జరిగాయి. ఏకంగా ఓ బడా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ అమెరికా నుండి సదరు డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్ ను కొనుక్కొచ్చి, ఆ కంటెంట్ తో కోట్లు సంపాదించారు అని చెప్పుకొనేవారు.
ఇక 2026 సంవత్సరానికి ఫ్రీ AI పుణ్యమా అని అందరికీ ఈ డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్ లు అందుబాటులోకీ వచ్చేయడంతో పోర్న్ సైట్స్ లో వేలకొద్దీ వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో హీరోయిన్లుగా చలామణి అయినవాళ్ళ నుండి.. ఇప్పుడిప్పుడే హీరోయిన్లుగా ఎదుగుతున్నవాళ్ళ వరకు అందరి ముఖాలతో అశ్లీల వీడియోలు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇది కేవలం హీరోయిన్లకు మాత్రమే పరిమితం అవ్వడం లేదు.. ఇన్స్టాగ్రామ్ లో కాస్త ఫేమస్ అయిన ప్రతి అమ్మాయి పరిస్థితి అంతే.
ఇవాళంటే చుట్టమల్లే పాట విషయంలో ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడు కాబట్టి కాస్తంత డిస్కషన్ పాయింట్ అయ్యింది, మరి రెగ్యులర్ హీరోయిన్లు లేదా మోడల్స్ లేదా సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎలాగైతే చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఉంటూ.. VPN వాడి అలాంటి కంటెంట్ చూసిన కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో.. ఇలా AI వినియోగించి అమ్మాయిల అశ్లీల ఫోటోలు, వీడియోలను సృష్టించేవాళ్ళని కూడా అదే విధంగా ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తే గానీ.. జనాల్లో భయం ఉండదు. ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు కానీ.. కనీసం భయం ఉంటే ఇలా సోషల్ మీడియాలో లింక్ ప్లీజ్ అని అడుక్కునే నిర్లజ్జపు యువతలో చలనం కలుగుతుంది.







