ఫస్ట్ లుక్ పిక్ టాక్ : అన్ని పోస్టర్లు ఒకేలా ఉండవు!

Aithe 2.0 firstlook posterచిన్న సినిమాలు ఊపందుకుకోవడానికి అప్పట్లో మంచి ప్రోత్సాహకరం ఇచ్చిన సినిమా “ఐతే…” (అన్ని సినిమాలు ఒకేలా ఉండవు). అంతా కొత్త వారితో ప్రయోగాత్మకంగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఫస్ట్ పోస్టర్ నుండి సినిమాకు చేసిన పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కడంతో ప్రేక్షకులు మొదటి రోజు నుండి బ్రహ్మరధం పట్టారు.

ADVERTISEMENT

తాజాగా అదే “ఐతే” పేరును వినియోగించుకుంటూ “ఐతే 2.0” పేరుతో మరో సినిమా సిద్ధమవుతోంది. మదిరాజ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. టైటిల్ లో చెప్పినట్లుగానే పోస్టర్ లో కూడా టెక్నికల్ వలయాన్ని చూపించడంతో సైబర్ క్రైం నేపధ్యంలో ఈ సినిమా కధ సాగుతుందన్న విషయం అర్ధమవుతోంది. ‘ఐతే’ సినిమాకు వాడిన ట్యాగ్ లైన్ ‘అన్ని సినిమాలు ఒకేలా ఉండవు…’ తరహాలోనే ‘అన్ని పోస్టర్లు ఒకేలా ఉండవు’ అనిపించేలా ‘ఐతే 2.0’ పోస్టర్ ఉంది.

ADVERTISEMENT
Latest Stories