అఖిల్ అక్కినేని నాలుగవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఒక కీలకమైన షెడ్యూల్ కోసం చిత్రబృందం సౌదీ అరేబియా వెళ్ళింది. అక్కడ పది రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటుంది. అందులో భాగంగా ఒక ఫైట్, ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారు.
అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ ప్లాపులుగా మిగులుతున్నాయి. ఇప్పటివరకూ మూడు ప్లాపులు మూటగట్టుకున్నారు. దానితో ఈ చిత్రం మీద భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.
020 ఉగాదికి సినిమాను విడుదల చెయ్యాలనే ప్లాన్ ఉన్నారు. ఉగాది అడ్వాంటేజ్ తో పాటు వేసవి సెలవులు కూడా కలిసి వస్తే సినిమాకు మంచి రన్ వస్తుందని నిర్మాతల భావన. పూజా హెగ్డే ప్రస్తుతం.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు ప్రభాస్ నెక్ట్స్ సినిమా జాన్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ కావడం సినిమాకు కొంత కలిసొచ్చే విషయమే. ఈ చిత్రం అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. 2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్ సినిమా చేస్తున్నాడు. కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఈ సారైనా అఖిల్ సరైన హిట్ సాదిస్తాడేమో చూడాల్సి ఉంది.





