
ఈ రెండు సినిమాలను పరిశీలిస్తే… ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకు ఈ రెండు సినిమాలు ఒకే విధంగా ప్రయాణించాయి. కానీ ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత మాత్రం అక్కినేని అఖిల్ “హలో”ది కాస్త పైచేయి కనపడుతోంది. అలాగని నాని “ఎంసీఏ”ను తక్కువ చేయడానికి లేదు గానీ, రొటీన్ కమర్షియల్ గా “ఎంసీఏ” కనపడుతుండగా, అఖిల్ “హలో”లో మాత్రం ఫ్రెష్ నెస్ కొట్టొచ్చినట్లు దర్శనమిస్తోంది. దీంతో ట్రైలర్ విడుదల తర్వాత ‘హలో’ సినిమా కాస్త పైచేయి సాధించినట్లయ్యింది.
సింపుల్ గా చెప్పాలంటే… ముందుగా విడుదల కాబోతున్న నాని “ఎంసీఏ” పక్కా కమర్షియల్ బొమ్మగా కాసులు కురిపించే సినిమాగా చెప్పవచ్చు. అలాగే మరుసటి రోజున రిలీజ్ అవుతోన్న అఖిల్ “హలో” సినీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రంగా అభివర్ణించవచ్చు. ఇప్పటికే ‘డబుల్ హ్యాట్రిక్’ కొట్టిన నాని “ఎంసీఏ” సినిమాకు ప్రధాన హైలైట్ కాగా, తొలి సినిమాతో కొట్టలేని ‘బ్లాక్ బస్టర్’ సక్సెస్ ను ఈ సినిమాతో ఖచ్చితంగా అందుకుంటాననేది అఖిల్ నమ్మకం.
Akshay Kumar is set to reunite with Priyadarshan for another film, but unlike their usual…
Ee Nagaraniki Emaindi was not a big box-office success when it was released in 2018.…