
ఈ పోస్టర్ తోనే అక్కినేని అభిమానులు ఫిదా అయిపోతే కాసేపటి క్రితం దర్శకుడు అఖిల్ కండలను చూపిస్తూ ఇంకో ఫోటో విడుదల చేశారు. ఏడు నెలల పాటు ఈ లుక్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాని, అతని కష్టం తననే ఆశ్చర్యపరిచిందని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఏడు నెలల కష్టం… ఈ సారి కొట్టే హిట్ కు ఏడేళ్ళకు సరిపడా రీసౌండ్ రావాలి అక్కినేని అభిమానులు కసిగా అంటున్నారు. ఏజెంట్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 న విడుదల అవుతుంది. ఈ చిత్రం ఉగాది రోజున సెట్స్ మీహకు వెళ్లనుంది మరియు భారతీయ మరియు విదేశాలలో పలు ప్రదేశాలలో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చనున్నారు. ముంబైకి చెందిన మోడల్ సాక్షి వైద్య ఈ చిత్రంతో అఖిల్ సరసన నటిస్తూ… తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతోంది. ఇది ఇలా ఉండగా… అఖిల్ తదుపరి చిత్రం… మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య వేడెక్కిన వాతావరణం ఇప్పుడు కాస్త చల్లబడిందా…
Recently, the trailer for Nayanthara's upcoming film Mookuthi Amman 2: Mahasakthi directed by Sundar C,…