సాధారణంగా సినిమాల్లో హీరోలను, హీరోయిన్లను చూసే పద్దతిలో చాలా తేడా ఉంటుంది. హీరోలు రొమాంటిక్ సీన్లో పాల్గొంటే ఎంజాయ్ చేసాడు అంటారు, ఏ హీరోయిన్ చేస్తేనేమో బరితెగించింది అంటారు. కొంచెం హార్ష్ గా అనిపించినా కానీ ప్రస్తుతం ఉన్న ఆలోచనా తీరు ఇలానే ఉంది.
ఇప్పుడు ఖుషి సినిమా చూసాక కొంత మంది ఆడియన్స్ తీరు చూస్తుంటే ఇక ఎప్పటికీ మారరేమో అన్న ఫీలింగ్ వస్తుంది.
ఖుషి సినిమా చూసి వచ్చాక కొంత మంది రియాక్షన్ ప్రకారం, సమంత రొమాంటిక్ సీన్లో నటించింది అన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. సమంత బెడ్ రూమ్ సీన్స్ లో నటించింది అంటూ ఫీల్ అవుతున్నారు కొంత మంది అక్కినేని ఫ్యాన్స్. నీ వెనకాల అక్కినేని ఫ్యామిలీ ఉండగా నువ్వు ఎలా ఇలాంటి సీన్స్ చేస్తావు అంటూ ఆవేశపడుతున్నారు.
సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ అత్యుత్సాహ వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇది విన్న ఎవరికైనా ఏంటిది అనిపించక మానదు. సమంతకు విడాకులు అయిపోయాక తన లైఫ్ తను లీడ్ చేసుకుంటోంది. ఇంకా తనను అక్కినేని హీరోయిన్ లా చూడటంలో ఎలాంటి అర్ధం లేదు.
ఇదే సమస్య పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అనుభవించింది. ఇప్పటికీ ఆమెను పవన్ కళ్యాణ్ కు లింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సమంతను కూడా ఇదే సమస్య వెంటాడుతోంది. ఆమె ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి సీన్లు చేయకూడదు వంటివి కొంత మంది డిసైడ్ చేయడం అనేది ఎంత వరకూ సమంజసం.
అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం. పోనీ సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య థాంక్యూలో రాశి ఖన్నాతో లిప్ లాక్ సీన్లు చేసినప్పుడు మరి ఈ సదరు ఫ్యాన్స్ ఎందుకు ఫీల్ అవ్వలేదు?
చైతూకి ఒక రూల్, సామ్ కి ఒక రూల్ పెట్టడం తప్పే కదా? ఇది ప్రజలకు అర్ధమయ్యే వరకూ హీరోయిన్లకు, నటీమణులకు ఇలాంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు.



