పాట అదుర్స్ కానీ ఇప్పుడెందుకు?

Ala Vaikunthapurramulo Winning Over Sye Raa In This Departmentస్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమాలోని సామజవరగమణ అనే పాట కాసేపటి క్రితం విడుదల చేశారు. తమన్‌ కంపోజిషన్లో సిరివెన్నెల సీతారామాశాస్త్రి రాసిన ఈ పాటని సిద్‌ శ్రీరామ్‌ పాడాడు. మంచి మెలోడీ గా ఉన్న ఈ పాట వెంటనే మంచి రెస్పాన్స్ సాధించింది. ట్విట్టర్ లో ట్రెండ్ కూడా అవుతుంది.

అయితే ఎంత పెద్ద సినిమాకైనా రెండు నెలల ముందే ప్రమోషన్‌ మొదలవుతుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాకి దసరా రాకముందే ప్రమోట్‌ చేస్తున్నాడు త్రివిక్రమ్‌. ఇది చాలా చిత్రంగా ఉంది. దాదాపుగా నాలుగు నెలల సమయం ఉంది సినిమా విడుదలకు. ఇంత హడావుడిగా.. ఇంత ఎర్లీగా ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు?

ADVERTISEMENT

చిత్రానికి జనవరి 12ని రిలీజ్‌ డేట్‌గా ఫిక్స్‌ చేశారు. ఫిలిం నగర్ లో తాజాగా వినిపిస్తున్న గాసిప్స్‌ ప్రకారం మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలనుకుంటున్నారట. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల మధ్య ఒక రోజో, రెండు రోజులో గ్యాప్‌ అయినా ఉంటుందనుకున్నారంతా.

డైరెక్ట్ క్లాష్ వల్లే అల వైకుంఠపురంలో నిర్మాతలు తమ ప్రమోషన్ ముందు మొదలు పెట్టారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. క్లాష్ అంటే బిజినెస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానితో బాగా ప్రమోట్ చేస్తే మంచి రేట్లు వస్తాయి అనుకుంటున్నారట. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్ ప్రకటిస్తే దీనిపై కొంత క్లారిటీ రావొచ్చు.

ADVERTISEMENT
Latest Stories