ఆ సినిమా Shelve కాలేదట!

Allari Naresh Alcohol movie update

అల్లరి నరేష్ హీరోగా సితార సంస్థ “ఆల్కహాల్” అనే సినిమా తీసింది. గత ఏడాది నరేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేసారు. 2026 జనవరి 1న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.

కట్ చేస్తే.. 2026 ఆగస్ట్ వచ్చినా ఆ సినిమా గురించి ఎక్కడా సౌండ్ లేదు. సితార సంస్థలో అదొక సినిమా ఉందన్న విషయం కూడా హైలైట్ చేయడం లేదు ప్రొడక్షన్ టీమ్.
ఈ విషయమై ఇవాళ రెస్పాండ్ అయ్యారు అల్లరి నరేష్.

ADVERTISEMENT

నరేష్ తాజా చిత్రం “రంభ ఊర్వశి మేనక” టీజర్ లాంచ్ ఈవెంట్లో జరిగిన మీడియా సమావేశంలో “ఆల్కహాల్ ఏమైంది?” అనే ప్రశ్నించగా.. ఆ సినిమా హోల్డ్ లో పెట్టారు సితార వాళ్ళు. వాళ్ళకి ప్రస్తుతం “విశ్వనాథ్ అండ్ సన్స్, ఎపిక్”లు ఉన్నాయి. వాటి తర్వాత ఆల్కహాల్ బయటికి తీసుకొస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేసారు తప్పితే.. కాన్ఫిడెంట్ గా చెప్పలేదు.

అందుకు కారణం లేకపోలేదు. ప్రతి సినిమాకి ఓటీటీ డీల్ అయ్యాక కానీ షూటింగ్ మొదలుపెట్టని నాగవంశీ, ఆల్కహాల్ విషయంలో మాత్రం ఆ టాస్క్ ఇంకా కంప్లీట్ చేయలేదు. అందుకే సినిమా రిలీజ్ పై క్లారిటీ లేదని తెలుస్తోంది.

అయితే.. నరేష్ కామెంట్స్ తో “ఆల్కహాల్” అనే సినిమా షెల్వ్ అవ్వలేదు అనే క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమాని నాగవంశీ థియేటర్ దాకా తీసుకొస్తారా? లేక ఓటీటీకి సరిపెడతారా? అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories