నితిన్ బోల్డ్ రిస్క్

Alias Rukmini Teaser: Nithiin Takes His Boldest Risk Yet

24 ఏళ్ల కెరీర్లో నితిన్ వర్క్ చేసినంతమంది స్టార్ డైరెక్టర్స్ తో ఏ టైర్ 1 హీరో కూడా చేసి ఉండడు. రాజమౌళి మొదలుకొని వినాయక్ దాకా ఆల్మోస్ట్ అందర్నీ కవర్ చేసినప్పటికీ ఎందుకో మంచి స్టార్ డం మాత్రం దక్కించుకోలేకపోయాడు.

అయితే చేసినవన్నీ టెంప్లేట్ అండ్ సేఫ్ జానర్ సినిమాలే అవ్వడం కూడా అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇష్క్ తో మళ్లీ హిట్ కొట్టినా ఆది కూడా సేఫ్ జోన్ సినిమానే.

ADVERTISEMENT

కెరీర్ మొత్తంలో నితిన్ ఫలానా రిస్కీ సినిమా చేశాడు, లేదా రిస్కీ జోనర్ ట్రై చేశాడు అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు.

అయితే.. ఇప్పుడు వరుస పరాజయాల వల్ల వచ్చిన క్లారిటీనో లేక ఇప్పటికైనా రిస్క్ చేయకపోతే కెరీర్ ఉండదు అని రియలైజేషనో తెలియదు కానీ.. ఎట్టకేలకు కెరీర్ లో ఒక రిస్క్ చేస్తున్నారు నితిన్.

విషయం ఏంటంటే.. నిన్న విడుదలైన “అలియాస్ రుక్మిణి” టీజర్ లో ఎంతమంది గమనించారో తెలియదు కానీ.. అందులో చూపించిన, ప్రస్తావించిన పుస్తకాలన్నీ శృంగార నవలలే. సదరు పుస్తకాలను రుక్మిణి అనే పెన్ నేమ్ తో నితిన్ పాత్ర రాస్తుంటాడు.

కాస్త హిందీ కల్చర్ తెలిసి ఉంటే.. మస్త్ రామ్ అనే రచయిత పేరుతో వచ్చిన శృంగార నవలలు 1990 కాలంలో సెన్సేషన్. ఎంతోమంది రాజకీయ నాయకులు సైతం సదరు పుస్తకాలు చదువుతూ భావప్రాప్తి పొందేవారని చెప్పుకునేవారు. కొన్నాళ్ళకి వాటి ప్రభావం యువకుల మీద, పిల్లల మీద పడుతుందని గ్రహించి మస్త్ రామ్ రచనలని బ్యాన్ చేసారు.

తెలుగులోనూ ఈ శృంగార రచనలు ఇంకాస్త ఇంటెన్సిటీతో ఏకంగా బూతులతో బస్టాండుల్లో దొరికేవి. అయితే… సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా లభ్యమవుతున్న సాఫ్ట్ పోర్న్ కంటెంట్ వల్ల.. ఈ రచనలకు డిమాండ్ తగ్గి, కొన్నాళ్లకు అవి కనిపించకుండాపోయాయి.

ఇప్పుడు “అలియాస్ రుక్మిణి” ఆ శృంగార పుస్తకాల నేపథ్యంలో వస్తున్న సినిమానే అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే కచ్చితంగా తెలుగు నేటివిటీకి తగ్గట్లు సినిమాలో సదరు రచనలను టోన్ డౌన్ చేయడం కామన్.

మరి నితిన్ ఇన్నాళ్లకు ధైర్యం కూడబలుక్కుని చేస్తున్న ఈ బోల్డ్ రిస్క్ ఎంతవరకు జయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories