
చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. కానీ ఇలాంటి సూక్తులు చెవి కెక్కించుకొని ఉంటే వైసీపీ నేడు ఈ దుస్థితిలో ఉండేదే కాదు.
అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని భ్రష్టు పట్టించేసిన వైసీపీ, నేటికీ అదే ద్వేషం ప్రదర్శిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా వ్యతిరేకిస్తోంది. చేతిలో సొంత మీడియా ఉంది కనుక పనిగట్టుకొని అమరావతి గురించి దుష్ప్రచారం చేస్తూనే ఉంది.
అయితే ఈ ద్వేషం ఇప్పుడు మొదలైంది కాదు. నాడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడే మొదలైంది. కానీ అప్పుడు దానిని దాచిపుచ్చుకొని అమరావతే రాజధానిగా ఉంటుందని ఎన్నికలకు వెళ్ళి గెలిచి అధికారంలోకి వచ్చింది.
కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా మొదటి నుంచే బహిరంగంగా అమరావతిని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఇదొక గొప్ప స్ట్రాటజీ అని అనుకుంటుందే తప్ప దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించినట్లు లేదు.
నాడు చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని కోసం భూములు సేకరిస్తున్నప్పుడే, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు మొట్టికాయలు వేసి పంపింది. అప్పటికైనా వెనక్కు తగ్గి ఉంటే హుందాగా ఉండేది.
కానీ అధినేత కళ్ళలో ఆనందం చూసేందుకు సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడా మొట్టికాయలు పడ్డాయి. రాజకీయ కారణాలతో ఇలాంటి కేసులు వేశారంటూ ఆయన వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు పైన మరో కోర్టు లేదు. ఉండి ఉంటే అక్కడికీ వెళ్ళి ఉండేవారేమో?
అయితే అధినేత కళ్ళలో ఆనందం కోసం చేసిన ప్రయత్నమూ ఫలించక పోగా ఆళ్ళకు పాపం మొట్టికాయలు, అవమానాలే మిగిలాయి.
ప్యాలస్ కోసం ఇంత చేసినా 2024 ఎన్నికలలో మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడీ అప్రదిష్ట!
మంగళగిరికి ప్రాతినిధ్యం వహించిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అమరావతిని అడ్డుకున్నారనే ముద్ర కూడా పడింది. బాస్‌ని నమ్ముకున్న వాళ్ళందరి పరిస్థితి చివరికి ఇంతేనా?
In the film industry, a famous surname can make the first step much easier. It…
Not every fan meeting is a political rehearsal. But in Tamil Nadu today, it is…