Telugu

మంగళగిరి మొనగాడెవరు.?

రాష్ట్ర విభజన తరువాత ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్ అయ్యింది. అటు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో నివాసం ఏర్పాటు చేసుకోవడం,

అలాగే నాటి ప్రతిపక్ష నేత వైస్ జగన్ తాడేపల్లిలో ప్యాలస్ నిర్మించుకోవడం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కాజా లో ఏర్పాటు చేయడంతో ఇలా రాజకీయ ప్రముఖుల కార్యకలాపాలన్నీ మంగళగిరి కేంద్రంగా సాగడంతో మంగళగిరి అందరి దృష్టిని ఆకర్షించింది.

ADVERTISEMENT

దానికి తోడు 2019 ఎన్నికలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పై సుమారు 1000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. దీనితో మాజీ ముఖ్యమంత్రి కొడుకు, టీడీపీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ ఓడిపోయాడు అంటూ వైసీపీ లోకేష్ ను కించపరిచేలా విమర్శలు గుప్పించింది.

అయితే 2014 నుంచి 2024 వరకు మంగళగిరి లో వైసీపీ హవానే నడిచింది, ఎమ్మెల్యే గా ఆర్కేకే పీఠం దక్కింది. ఆ పదేళ్ల సమయంలో మంగళగిరి అభివృద్ధికి ఆళ్ల చేసిన కృషి ఏంటి.? ఆయను ఎమ్మెల్యే గా ఎన్నుకోవడంతో ఆ నియోజకవర్గ ప్రజలకు ఓరిగిందేంటీ.? అంటే,

నన్ను గెలిపించండి, మా పార్టీని అధికారంలోకి తీసుకురండి మీకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందిస్తాను అంటూ ఆళ్ల చేసిన హామీలు 2019 లో తాడేపల్లి కరకట్ట ప్రజల పాలిట శాపాలు గా మారిపోయాయి. జగన్ భద్రత పేరుతో దశాబ్దాల నాటి వారి ఇళ్లను కూల్చేస్తూ, బలవంతపు తరలింపులకు పాల్పడ్డారు ఆళ్ళ.

ఇక ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతిని సమాధి చేసిన జగన్ కు ఆళ్ల తమవంతు సహకారం అందించారు. 2019 టీడీపీ ఓటమితో వైసీపీ విజయంతో మంగళగిరిలో ఒక్కసారిగా భూముల ధరలు పాతాళానికి పడ్డాయి. ఇవన్నీ ఆళ్ల నాయకత్వంలో జరిగిన ఘనకార్యాలే.

ఇక 2024 దశాబ్దాల నాటి టీడీపీ కలను 90 వేల ఓట్ల మెజారిటీ తో నిజం చేసారు నారా లోకేష్. కొన్ని దశాబ్దాల క్రితం మంగళగిరిలో సమాధైనా టీడీపీ జెండాకు తన గెలుపు తో పునాది వేశారు లోకేష్. అటు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గా అటు మంత్రిగా తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా చేసేందుకు లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారు.

అందులో భాగంగానే స్వచ్ఛ మంగళగిరికి అమలు చేస్తూ, ఎన్నో దశాబ్దాల ఇళ్ల పట్టాల పేదల కలను నిజం చేసి శభాష్ లోకేష్ అనేలా నియోజకవర్గ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు అందుకున్నారు. అలాగే మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి అంకురార్పణ చేసారు.

వాకర్స్ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఎకో పార్క్ రుసుము రద్దు చేస్తూ తన సొంత జేబులో నుంచి ఆ రుసుము చెల్లిస్తున్నారు. నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తున్నారు.

ఇలా గత పదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యే చెయ్యలేని అభివృద్ధిని, ఆళ్ల చేపట్టలేని సంస్కరణలను లోకేష్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసి చూపిస్తున్నారు. 2019 ఓటమి లోకేష్ ను మంగళగిరి ప్రజలకు మరింత దగ్గర చేసిందనే చెప్పాలి. ఓటమి లోకేష్ ను నియోజకవర్గానికి దూరం చేయలేదు, అలాగే గెలుపు ఆళ్ల ను ఇక్కడి ప్రజలకు చేరువ చేయలేదు.

వైసీపీ అరాచకాలు తన ఆయుధాలుగా మార్చుకుంటూ ఒక్క ఓటమితో వైసీపీ అభ్యర్థి ఆళ్ల ను అజ్ఞాతంలో, వైసీపీ ని పాతాళంలోకి నెట్టారు లోకేష్. దీనితో మంగళగిరి మొనగాడెవరో ఇప్పుడు వైసీపీ కి పూర్తి స్పష్టత వచ్చే ఉంటుంది అంటున్నారు స్థానిక ప్రజానీకం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

3 Biggest Disasters: Even 50% Discounts Couldn’t Save

The month of September in the ongoing year turned out to be unlucky for a…

18 minutes ago

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

9 hours ago