130 మందిని అడిగాడు బన్నీ… అలాంటి కోరికలు వాడివి..!

Allu Aravind Allu Arjun relation‘సరైనోడు’ సక్సెస్ సంబరాల్లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసుకుని తమ అనుభవాలను పంచుకుంటోంది. ఇందులో భాగంగా కొడుకు అల్లు అర్జున్ గురించి అల్లు అరవింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. “దర్శకుడు బోయపాటి శ్రీనుకు, మా అబ్బాయి అల్లు అర్జున్ కు సినిమాలంటే మహా పిచ్చి అని, చాలా ఇష్టంతో పనిచేస్తారు, అయితే ఒకానొక సమయంలో వీళ్లిద్దరూ కలిసి నాకు పిచ్చెక్కిస్తారేమో అనిపించింది” అంటూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ‘సరైనోడు’పై తనకు తానే సెటైర్లు వేసుకున్నారా… అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

పిల్లలు చాక్లెట్లు అడిగినట్లు బన్నీ నన్ను కోరే కోరికలు ఇలా ఉంటాయని… ఉదాహరణలు చెప్పుకొచ్చారు అరవింద్. కోరికలు కోరతారు. “రుషీ పంజాబీ అనే ఒకతను యాడ్ ఫిల్మ్ చేశాడట. అతను యాడ్ ఫిల్మ్ కే రోజుకు కొన్ని లక్షలు తీసుకుంటాడు, అటువంటి వ్యక్తి కావాలని, అతన్ని తీసుకురమ్మని చిన్న పిల్లాడు అడిగినట్లు” తనను బన్నీ అడుగుతాడంటూ సక్సెస్ మీట్ లో బన్నీ అంతరంగాన్ని బయటపెట్టారు. “సరైనోడు” సినిమా ఇంటర్వెల్ కు ముందు కేథరిన్ తో వచ్చే పాటలో 130 మంది డ్యాన్సర్లు కావాలని, అదీ కూడా బాంబే డ్యాన్సర్లు కావాలంటూ” బన్నీ కోరికలను తెలియజేసారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories