Telugu

వైసీపీకి మరో అస్త్రం చిక్కినట్టేగా..!

2024 ఎన్నికలు వైసీపీని అధః పాతాళానికి తోక్కేసిన మాట ఎంత వాస్తవమో మెగా vs అల్లు గా మారిన మాట కూడా అంటే వాస్తవమని ఒప్పుకుని తీరాల్సిందే. ఒక్క నియోజకవర్గం రెండు కుటుంబాల మధ్య ఎదో జరుగుతుంది, జరగబోతుంది అనే ఊహకు బలాన్ని తీసుకువచ్చింది. నంద్యాల వేదికగా మొదలైన ఈ సోషల్ మీడియా వార్ ఇప్పటికి ఎదో ఒక రూపంలో ఎక్కడో అక్కడ కొనసాగుతూనే వస్తుంది.

2024 ఏపీ ఎన్నికలలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రా కు మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన మాట, ఆయనకు మద్దతు తెలిపిన విషయం ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. మెగా.. అల్లు ఈ రెండు బ్రాండ్ల మధ్య వైరం అనే భీజం అక్కడే పడి మొక్కగా ఎదుగుతుంది. జనసేన పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అల్లు అర్జున్ వైసీపీ గెలుపు కోసం ఆరాట పడడం ఏంటి అనేది మెగా ఫాన్స్ ప్రశ్న, జనసేన అభిమానుల వాదన.

ADVERTISEMENT

తీరా అల్లు అర్జున్ మద్దతు తెలిపిన సదరు శిల్ప రవి కనీసం నెగ్గారా అంటే అది లేదు. ఆయన ఒడి వైసీపీ కి ఒక అస్త్రాన్ని సృష్టించారు. అల్లు అర్జున్ వచ్చినా కూటమి దెబ్బకు శిల్ప తో పాటు వైసీపీ కూడా భూస్థాపితం కాకతప్పలేదు అంటూ కూటమి మద్దతుదారులతో పాటుగా మెగా ఫాన్స్ కూడా సంబరాలు చేసుకుంది.

అల్లు అర్జున్ తీసుకున్నఈ ఒక్క రాజకీయ నిర్ణయంతో అలకపూనిన మెగా ఫాన్స్, వైసీపీ వ్యతిరేక వర్గమంతా పుష్ప 2 సినిమా మీద గుర్రుగా ఉన్నారు. దీనికి ఆజ్యం పోస్తూ కర్ణాటక పర్యటనకు వెళ్ళినప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాడు అడవులను కాపాడేవాడు హీరోలు నేడు అడవులను విధ్వంసం చేసే వారు, స్మగ్లర్ లు హీరోలుగా మారారు అంటూ వ్యాఖ్యానించడం ఇది పుష్పకు కౌంటరే అంటూ పవన్ వీడియో ను వైరల్ చేసారు.

ఇక ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరోసారి నిప్పు రాజేశాయి. సుకుమార్ సతీమణి సమర్పణలో వస్తున్న మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా ప్రమోషన్ కు విచ్చేసిన అల్లు అర్జున్ ‘నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనస్సుకి నచ్చితేనే వస్తా’.. ,అది మీకు తెలుసులే అంటూ తన ఫాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు మరోసారి మెగా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీనితో ఇన్నాళ్లు వార్ వన్ సైడ్ గా సాగిన సోషల్ మీడియాలో వార్ ఇప్పుడు రెండు వైపులా పదునెక్కింది.

అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు నంద్యాల ఎన్నికల తాలూకా వ్యాఖ్యలే, ఇవి పవన్ ను అగౌరవ పరిచేలా ఉన్నాయి అంటూ పుష్ప కోసం మేము కూడా తగ్గేదెలా అన్నట్టుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి పిల్లి ఎలుక కొట్టుకుని నక్కకు ఆహారమైనట్లు మెగా, అల్లు కాంపౌండ్లలో జరుగుతున్నా ఈ సోషల్ మీడియా వార్ వైసీపీకి మంచి బూస్టప్ ఇస్తుంది.

అల్లు అర్జున్ మెడ మీద వైసీపీ గన్ పెట్టి మెగా కుటుంబాన్ని ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గురి పెట్టడానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది వైసీపీ సోషల్ మీడియా. అల్లు అర్జున్ కు మద్దతుగా పవన్ అభిమానులను రెచ్చకొట్టడం, పవన్ అభిమానుల మూసుకులో అల్లు అర్జున్ ఫాన్స్ ని ఇబ్బంది పెట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యే అన్నది ఇరు వర్గాల అభిమానులు ఆలోచించాలి.

ఇన్నాళ్లుగా జూ. ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ మీద రాజకీయం చేసిన వైసీపీ కి ఇప్పుడు జనసేనను టార్గెట్ చెయ్యడానికి అల్లు అర్జున్ అస్త్రంగా మార్చుకుంటుంది అనేది గ్రహించాలి. ఈ మూవీ వార్ ను పొలిటికల్ వార్ గా మారిస్తే దాని వల్ల భవిష్యత్తులో ఫేక్ ప్రచారాలు సృష్టించి లాభపడేది వైసీపీ నే అని ఇరు వర్గాలు గ్రహించి దీనికి ఇక్కడితో ఒక ఎండ్ కార్డు వేయాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Harish Shankar: A Strong Message to Vijay’s Trolls

Trolling has become a part of the film industry, especially in the age of social…

8 minutes ago

Varanasi: After Rajamouli, What Options Left for Mahesh?

Mahesh Babu has spent years waiting for a project that can take him to the…

37 minutes ago