రేపు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఇవాళ విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సరైన స్థాయి అంచనాలు క్రియేట్ చేయలేకపోయింది. ఓ వింత జంతువు చేతి గోళ్ళను హైలైట్ చేస్తూ విడుదలైన పోస్టర్ సినిమా థీమ్ ను లేదా వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అయినప్పటికీ, “పుష్ప” తర్వాత బన్నీ సినిమా సృష్టించాల్సిన స్థాయి హైప్ క్రియేట్ అవ్వలేదు.
షూటింగ్ స్టార్ట్ అయ్యి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన ఒక్క లుక్ లేదా విషయం లీక్ అవ్వకుండా అట్లీ & టీమ్ బాగానే జాగ్రత్తపడినప్పటికీ, ఇప్పుడు టైటిల్ విషయంలో క్రియేట్ అయిన హైప్ ను అందుకోగలరా? అనే అనుమానం మాత్రం అందరిలోనూ ఉంది. బన్నీ మునుపటి సినిమాల టైటిల్స్ అన్నీ దాదాపుగా ముందే లీక్ చేసి ఆడియన్స్ ను ప్రిపేర్ చేసారు. ముఖ్యంగా “పుష్ప” అనేది అమ్మాయి పేరు కాబట్టి, జనాలు ఎలా తీసుకుంటారో అని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ముందే టైటిల్ ను సోషల్ మీడియాలో లీక్ చేసి రెస్పాన్స్ ను తెలుసుకున్నాడు సుకుమార్.
మరి అట్లీ ఏ నమ్మకంతో ఇంత సీక్రెట్ గా టైటిల్ ను ఉంచాడు? ఉంచాడు సరే, ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ హైప్ ను అందుకోగలదా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇండియన్ మార్కెట్ మాత్రమే కాకుండా అవుటాఫ్ ఇండియా కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా ఇంగ్లీష్ టైటిల్ అనేది తెలిసిందే, అయితే అది క్యారెక్టర్ పేరై ఉంటుందా? లేక సినిమా ప్రపంచం తాలుకు విషయమై ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ సస్పెన్స్ కి రేపు ఉదయం 11 గంటలకి తెర పడిపోతుంది అనుకోండి, అయితే.. అల్లు అర్జున్ అభిమానులని, సగటు సినిమా ప్రేక్షకుల్ని అట్లీ ఏస్థాయిలో సంతుష్టులను చేయగలడు అనేది అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న అంశం.




