టీజర్ టాక్ – బన్నీ హీరోయిజాన్ని లేపిన బోయపాటి!

alluarjun- sarainodu teaser talkబోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమాలు సాధారణంగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తాయన్న విషయం తెలిసిందే. ఇక, మాస్ ప్రేక్షకులకు నిలయం మెగా ఫ్యాన్స్. ఈ ఇద్దరూ కలిస్తే ఏమవుతుంది… అదే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “సరైనోడు” సినిమా. తొలి టీజర్ సినీ ప్రేక్షకులను పలకరించడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచే విధంగా “సరైనోడు” సినిమా టీజర్ ను కట్ చేసింది చిత్ర బృందం. ‘ఎర్రతోలు కదా… స్టైల్ గా ఉంటాడనుకున్నావేమో… మాస్… ఊర మాస్…” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ లో ఇంటేన్సిటి వినపడుతుంటే… ఊర మాస్ అని చెప్పిన బన్నీని మిక్కిలి స్టైల్ గా ప్రజెంట్ చేసారు బోయపాటి. టీజర్ లో చూపించిన షాట్లతో హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూపించబోతున్నారన్న సంకేతాలు ఇచ్చేసారు బోయపాటి.

ADVERTISEMENT

తమన్ అందించిన నేపధ్య సంగీతం, ఫోటోగ్రఫీ, బోయపాటి టేకింగ్ అన్నీ కూడా “సరైనోడు”పై సరైన అంచనాలు పెంచేవిగానే ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. రేపటి నుండి దాదాపు 1000 సిల్వర్ స్క్రీన్స్ పై కూడా “సరైనోడు” సందడి చేయనున్నాడు. బహుశా ఈ టీజర్ ను చూడడానికే మెగా ఫ్యాన్స్ “కృష్ణాష్టమి” సినిమాకు పరుగులు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ADVERTISEMENT
Latest Stories