అల్లు అర్జున్ కారవాన్‌ను ఢీకొట్టిన లారీ… ఖమ్మంలో ప్రమాదం

Allu Arjun Caravan Accidentస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాలలో రెండు ముఖ్యమైన షెడ్యూల్లను పూర్తి చేసింది. ఏజెన్సీ ప్రాంతాలైన రాంపచోదవరం మరియు మారేడుమిల్లి లో కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేశారు. ఈ షూట్ సమయంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా రూపొందించిన కారవాన్ ను ఉపయోగించాడు.

షూటింగ్ ముగియడంతో, కారవాన్ హైదరాబాద్కు తిరిగి వెళ్తుండగా… మార్గమధ్యలో ఖమ్మంలోని సత్యనారాయణపురం వద్ద ప్రమాదానికి గురయ్యింది. కారవాన్‌ను వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు నటుడు దాని లోపల లేడు. అయితే అల్లు అర్జున్ కు సంబంధించిన కారవాన్‌ కావడంతో నటుడు గాయపడి ఉంటాడని అక్కడకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ రోజు మధ్యాహ్నమే బన్నీ తన కారును నడుపుతూ హైదరాబాద్ చేరుకున్నాడని సమాచారం. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాధమిక సమాచారం. 2009లో నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక రోడ్ ప్రమాదంలో ఖమ్మం వద్దనే గాయపడ్డారు. బన్నీ క్షేమంగా ఉండటంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇది ఇలా ఉండగా పుష్ప తదుపరి షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ స్పెషల్‌గా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories