చీఫ్ గెస్ట్ గా బన్నీ.? ఈసారి సమ్ థింగ్ స్పెషల్.!

Allu Arjun Chief Guest For Thandel Pre Release Event

పుష్ప బెనిఫిట్ షో విషాదం తో మొదలైన బన్నీ వివాదాలు ఆయన అరెస్ట్, ఇంటి పై దాడి ఆ పై మరికొన్ని ప్రభుత్వ పెద్దల వివాదాస్పద వ్యాఖ్యలు, దానికి కౌంటర్లు, పరామర్శలు, ఆర్థిక సాయాలు ఇలా ఒక సీరియల్ మాదిరి ఒకదాని తరువాత మరొకటి కొనసాగుతూ వెళ్లాయి.

ఈ నేపథ్యంలో తన నిశ్శబ్దంతో వివాదానికి ముగింపు పలికిన బన్నీ అటు మీడియాకు ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా అల్లు అరవింద్ నిర్మించిన నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కు బన్నీ ముఖ్య అతిధిగా విచ్చేస్తారు అన్న వార్త ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపెట్టిస్తుంది.

ADVERTISEMENT

తన సొంత సంస్థ అయిన గీత ఆర్ట్స్ బ్యానర్ సినిమాలకు బన్నీ చీఫ్ గెస్ట్ గా రావడం కొత్తేమి కాకపోయినా ఈ సారి సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు బన్నీ అభిమానులు. ఒక నిస్సహాయత, నిరుత్సాహం తరువాత అల్లు అర్జున్ ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడం కారణంగా ఈసారి ఆయన రాక మీద ఆ తరువాత జరగబోయే పరిణామాల మీద ఆసక్తి మొదలయ్యింది.

పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పేరు మర్చిపోయిన వివాదం అటు సినీ ఇండస్ట్రీ తో పాటుగా ఇటూ రాజకీయ రంగానికి కూడా కావాల్సినంత మసాలా అందించింది. దీనితో ఈ మంటలో రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు అనే వంటలు వండి వడ్డించేసారు. దీనితో అల్లు అర్జున్ అనుకోకుండానే ఒక రాజకీయ పద్మ వ్యూహంలో చిక్కుకుపోయారు.

దీనితో బన్నీ పుష్ప విజయాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి. అయితే పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా క్రెజ్ సొంత చేసుకున్న బన్నీ, ప్రమోషన్స్ తండేల్ కలెక్షన్ల మీద ప్రభావం చూపనుండడంతో ఆ గ్యాప్ తరువాత బన్నీ ఫిబ్రవరి 7 న విడుదలకు సిద్డమైన తండేల్ మూవీ ప్రమోషన్స్ కోసం బయటకు వస్తారా.? అంటూ ఆయన అభిమానులు ఆయన రాక కోసం, మాట్లాడే మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ రోజు సాయంత్రం హైద్రాబాద్ లో జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ ఈసారి గురితప్పేదెలా అంటూ పోస్టర్ ను విడుదల చేస్తూ తెలిపింది.

అయితే గతంలో మాదిరి బహిరంగ ప్రదేశాలలో, వేలాది అభిమానుల మధ్య ఈ ఈవెంట్లు నిర్వహించే సాహసం చేయలేకపోతున్న చిత్ర బృందాలు నాలుగు గోడల మధ్య, నలుగురు మీడియా మిత్రుల ఆధ్వర్యంలో ఈవెంట్లను మమ అనిపించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మరి తండేల్ కోసం బన్నీ బయటకు వస్తారా.?

ADVERTISEMENT
Latest Stories