Telugu

ఫ్రాంక్లీ… అల్లు అర్జున్ ‘రాకా’ ల్యాండ్ అయ్యిందా?

తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన “పుష్ప” తర్వాత అల్లు అర్జున్ సినిమా ఎలా ఉండబోతోంది? అనేది అందరి మెదళ్లలో ఇవాళ ఉదయం వరకు మెదిలిన ప్రశ్న.

ఓ హాలీవుడ్ సంస్థను పబ్లిసిటీ కోసం నియమించుకోవడమే కాక, షూటింగ్ మొత్తం ముంబైలోనే జరగడంతో ఇవాళ ఉదయం 11.00 గంటలకి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రొడక్షన్ టీమ్ రిలీజ్ చేసేవరకు ఎవరికీ కనీసం టైటిల్ ఏంటి అనేది కూడా తెలియలేదు. అట్లీ దర్శకుడు, హాలీవుడ్ స్టూడియోలతో కొలాబరేషన్ కాబట్టి ప్రపంచస్థాయిలోనే కంటెంట్ ఉండబోతోంది అనే అంచనా మాత్రం అందరికీ ఉంది.

ADVERTISEMENT

అయితే.. ఆ అంచనాలను ఇవాళ ఉదయం విడుదలైన “రాకా” టైటిల్, ఫస్ట్ లుక్ ఎంతవరకు అందుకోగాలిగాయి అంటే మిక్స్డ్ రెస్పాన్సులు వస్తున్నాయి.

సినిమా మరో లెవల్లో ఉండబోతోంది అనే క్లారిటీ వచ్చినప్పటికీ.. ఎక్కువశాతం ప్రేక్షకులు కానీ సినిమా అభిమానులు కానీ “రాకా” టైటిల్ తో సంతుష్టులు అవ్వలేదు.

అల్లు అర్జున్ లుక్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. “కాష్మోరా” అనే తమిళ చిత్రంలో కార్తీ లుక్ ని తలపించడంతో నవ్యత అగుపించలేదు. అయితే ఇది విలన్ లుక్ అని, హీరో లుక్ వేరేలా ఉంటుందని, అది కచ్చితంగా స్టైలిష్ గా, ఐకాన్ స్టార్ క్రేజ్ మరియు ఇమేజ్ కి తగ్గట్లుగా ఉంటుందని అంటున్నారు.

దీపిక పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరికొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా నటించనున్నారని సమాచారం ఉన్నప్పటికీ.. వాళ్లు ఎవరు, వారి పాత్రలేమిటి అనే విషయంలో గోప్యత పాటిస్తున్నారు. మరి రాబోయే ప్రమోషనల్ కంటెంట్ తో అయినా అట్లీ-బన్నీ ఫ్యాన్స్ అంచనాలను అందుకోగలరా అనేది చూడాలి.

ఇకపోతే సాయి అభ్యంకర్ విడుదల చేసిన “మేక్ వే ఫర్ ది కింగ్” బీజీయం మాత్రం మెల్లగా ఎక్కుతోంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Recent Posts

Pics: Nikita Flaunts Curves In Sexy Beach Outfits

Nikita Sharma is turning up the tropical heat with her latest breathtaking beach photoshoot, proving…

18 minutes ago

Will Tamil Fans Skip Ramayana for Nayanthara’s Comeback?

After the back to back failures of Toxic and Hi, Nayanthara's next release will most…

38 minutes ago