నువ్వు చెప్పకు… మేం చూసుకుంటాం..!

allu-arjun-says-cheppanu-brother-againపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రస్తుతం కాలం కలిసొస్తున్నట్లు లేదు. ఎక్కడ విన్నా… ఏం చేసినా ‘బూంరాంగ్’ అయ్యే ఉదంతాలే తారసపడుతున్నాయి. తమ అభిమాన హీరో పవన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా దారుణ పరాజయం పాలవ్వగా, ఆ తర్వాత విజయవాడ వేదికగా జరిగిన ‘సరైనోడు’ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ మాట దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యి సంచలనంగా నిలిచింది. అలాగే ప్రముఖ నిర్మాత పివిపి ‘జనసేన’ పార్టీ సంగతులు కూడా పవన్ ఫ్యాన్స్ కు కర్ణకఠోరంగా మారాయి.

ఇలా వరుస పరిణామాలతో నిరుత్సాహంలో ఉన్న పవన్ అభిమానులను మరొకసారి బన్నీ వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహపరిచాయి. ‘సరైనోడు’ సక్సెస్ ఊపులో ఉన్న బన్నీ, తాజాగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి అదే మాటను రిపీట్ చేయడం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. బహిరంగ ఆడియో వేడుకపై మాట్లాడడం ఓ విధంగా ఇబ్బంది కలిగించే విషయంగా సరిపెట్టుకున్నప్పటికీ, తాజాగా మళ్ళీ వాటినే రిపీట్ చేయడం పవన్ అభిమానులను రెచ్చగొట్టడమేనని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ADVERTISEMENT

దీంతో “నువ్వు చెప్పకు… మేం చూసుకుంటాం…” అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ బన్నీకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. తొలిసారి జరిగినపుడు ‘టంగ్ స్లిప్’ అనుకున్న పవన్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ గట్టి షాకే ఇస్తున్నారు. మరి ఈ ఉదంతం ఎటు వైపుకు మళ్లుతుందో గానీ… బన్నీ తీరుపై పవన్ ఫ్యాన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు. బహుశా దీని ప్రభావం ఏమిటో తదుపరి సినిమాల విడుదల సమయంలో గానీ తెలియకపోవచ్చు.

‘గంగోత్రి’ సినిమాలో అల్లు అర్జున్ ను చూసి ‘ఈయనేం హీరో’ అన్న వ్యక్తిని కూడా నెత్తిన పెట్టుకుని చూసుకున్నందుకు జరిగిన ప్రతిఫలమే ఇదని మెగా ఫ్యాన్స్ కూడా కలత చెందుతున్నారు. ఇదే మాట తొలి సినిమా ‘గంగోత్రి’ విడుదల తర్వాత మాట్లాడి ఉంటే… ప్రస్తుతం అల్లు అర్జున్ అనే వ్యక్తీ ఎలాంటి పరిస్థితులలో ఉండేవారో అంటూ గతాన్ని త్రవ్వడం… ప్రత్యేకంగా బన్నీని అభిమానించే వారిని వేధిస్తోంది. ఈ ‘చెప్పను బ్రదర్’కు క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో గానీ, పవన్ ఫ్యాన్స్ మాత్రం సమయం కోసం వేచిచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories