Telugu

ఆలస్యం అవుతుంది ‘అరవింద’ పుత్రా.!

రాజకీయ పార్టీల సానుభూతి, ఆయా పార్టీ నాయకుల ఓదార్పు ఒక్కో సందర్భంలో దృతరాష్ట్ర కౌగిలి మాదిరి అనుకోని ప్రమాదాలను తెచ్చిపెడతాయి. ఇప్పుడు అల్లు అర్జున్ మీద తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు చూపిస్తున్న సానుభూతి, ఆయా పార్టీల నాయకులు కురిపిస్తున్న ఓదార్పు అంతా కూడా బన్నీకి లేనిపోని కష్టాలను తీసుకువస్తున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టడానికి ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్ వచ్చిన ప్రతి అవకాశాన్ని తన రాజకీయానికి వినియోగించుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్, రేవంత్ ల మధ్య ఏర్పడిన ఈ వివాదాన్ని కూడా కేటీఆర్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా ఒక తెలుగు స్టార్ హీరో కి గుర్తులేదని, రేవంత్ ను తెలంగాణ సమాజం ఎవ్వరు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదంటూ వ్యాఖ్యానించి ఈ వివాదంలో ఇంకాస్త ఆజ్యం పోశారు. అలాగే జరిగిన ఘటనలో అల్లు ప్రమేయం లేదంటూ బన్నీ కి మద్దతు ప్రకటించి రేవంత్ కు అల్లు కుటుంబానికి మధ్య శత్రుత్వాన్ని పెంచారు.

అలాగే ఇటు పురందరేశ్వరి అటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా బన్నీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోంది అంటు బన్నీ కి మద్దతు తెలుపుతున్నారు. ఇక ఏపీలో ఇటువంటి రాజకీయాలలో ఆరితేరిన వైసీపీ ఎలాగూ ఉండనే ఉంది కాబట్టి జనసేన మీద ఉన్న ద్వేషంతో అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతూ తన రాజకీయ అవసరాన్ని నెరవేర్చుకునే పనిలో పడింది.

ఇలా ‘గోటితో పోయే వివాదాన్ని గొడ్డలి’ దాక తెచ్చిన ఈ రాజకీయ పార్టీల మద్దతు అల్లు కుటుంబాన్ని ఇంకాస్త ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉంది. అయితే అల్లు అర్జున్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటే ముందుగా ఈ రాజకీయ పార్టీల రాజకీయానికి ముగింపు పలకాలి. అందుకు తగ్గట్టుగా అల్లు అర్జున్ ఒక్క ప్రకటన చేయగలిగితే ఈ వివాదం కాస్త సద్దుమణిగే అవకాశం కనిస్తుంది.

ఇప్పటికే ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్న నెపంతో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆ మంటలో చలి కాచుకునే పనిలో ఉన్నారు ప్రతిపక్ష నేతలు. వీరు ఆడే రాజకీయ చదరంగంలో బన్నీ ఒక పావుగా మారబోతున్నారు అనేది అల్లు కుటుంబం గ్రహించి ఈ రాజకీయ పార్టీల రాజకీయానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ ఘటనకు సంబంధించి తన పై ప్రభుత్వ పెద్దల నుంచి ఎదురైన విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి తొందర పడ్డ అల్లు అర్జున్ తన భుజం మీద గన్నుపెట్టి తమ ప్రత్యర్థులను ఎక్కుపెట్టాలి అని చూస్తున్న రాజకీయ అవకాశవాదుల విషయంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యమయ్యింది ‘అరవింద పుత్రా’ ఇక తొందరపడండి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 3rd T20I: India Win, But a Big Reality Check!

India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…

4 hours ago

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

6 hours ago