
మెగా హీరోలు పోటీ పడవద్దనీ .. ఈ విధంగా జరగడం వలన విభేదాలు తలెత్తే అవకాశం ఉందని బన్నీ భావిస్తున్నారట. అంతే కాకుండా ఇలా పోటీపడటం వలన మెగా అభిమానులు కూడా చీలిపోయే అవకాశం ఉందనేది బన్నీ అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టతను ఇవ్వడం కోసం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరితో కలిసి త్వరలో ఆయన ఓ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లుగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
మెగా హీరోలు ఎవరైనా వారి వారి సినిమాల రిలీజ్ విషయంలో కనీసం రెండు మూడు వారాల గ్యాప్ పాటించాలని, అప్పుడే రెండు సినిమాలకు మేలు జరుగుతుందని, అదీ కాకుండా అభిమానులకు కూడా రెండు సినిమాలు చూసేందుకు సమయం లభిస్తుందని పలు సూచనలు చేయాలని భావిస్తున్నారట. ఏది ఏమైనా మెగా హీరోలకు సంబంధించిన అంశాలలో బన్నీ అందరి కంటే కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటున్నారనేది ట్రేడ్ టాక్.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…