బన్నీ, విజయ్ లు ఆ పోస్టులు ఎందుకు డిలీట్ చేసినట్లు ?

Allu Arjun Vijay Deverakonda Independence Day Post Controversy

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా విషెస్ లేదా పోస్టులు పెట్టడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఇందులో ఫార్మాలటీకి పోస్టులు పెట్టేవారుంటారు, నిజమైన దేశభక్తితో పోస్టులు పెట్టేవారూ ఉంటారు.

అయితే… నేడు 80వ స్వాతంత్రయ దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ ఒక స్టోరీ పోస్ట్ చేశాడు. కాకపోతే అది AI సాయంతో పోస్ట్ చేయబడింది అని పాయింట్ అవుట్ చేసేప్పటికి, వెంటనే ఇన్స్టా స్టోరీ మరియు ట్విట్టర్ పోస్ట్ డిలీట్ చేశారు బన్నీ అండ్ టీమ్.

ADVERTISEMENT

విజయ్ దేవరకొండ కూడా తన తాజా చిత్రం రణబాలి పోస్టర్ ను ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ డిజైన్ చేయించి పోస్ట్ చేశాడు. జాతీయ జెండాని కప్పుకున్నట్లుగా ఉన్న సదరు పోస్టర్ ను కొద్ది నిమిషాల్లోనే డిలీట్ చేసారు. విజయ్ మాత్రమే కాక మైత్రీ సంస్థ కూడా ఆ పోస్టును డిలీట్ చేసారు.

అల్లు అర్జున్ పోస్ట్ డిలీట్ చేశాడంటే AI అంటూ మాక్ చేసారు అనుకోవచ్చు. కానీ విజయ్ దేవరకొండ అండ్ టీమ్ పోస్టర్ ను ఎందుకు డిలీట్ చేసారు అనేదానికి మాత్రం క్లారిటీ లేదు.

ఇలా పోస్టులు పెట్టి డిలీట్ చేయడం అనేది కొత్త కాకపోయినప్పటికీ.. ఇండిపెండెన్స్ డే పోస్టులను ఇద్దరు స్టార్ హీరోలు డిలీట్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. మరి ఈ విషయమై సదరు హీరోల పిఆర్ టీమ్స్ ఏమైనా క్లారిటీ ఇస్తాయా లేక సైలెంట్ గా ఉంటాయా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories