
‘సోలో’ ఫేం పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. సొంత సినిమా కావడంతో నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండగా, ట్రైలర్ లో మొదట ఆకట్టుకునేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి అభినయం. అల్లరి పిల్లగా ప్రస్తుత యువతరం ఆలోచనలకు అనుగుణంగా ప్రసంగించే లావణ్య డైలాగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ ఫస్టాఫ్ లో లావణ్య చెప్పిన డైలాగ్స్ కు, సెకండాఫ్ లో శిరీష్ రివెంజ్ తీర్చుకుంటున్నట్లుగా సాగిన విధానం వీక్షకులకు వినోదాన్ని పంచుతోంది.
హీరోహీరోయిన్ల లుక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ “శ్రీరస్తు శుభమస్తు” హీరోగా అల్లు శిరీష్ కు మొదటి బ్రేక్ ఇచ్చేదిగా కనపడుతోంది. కొత్తదనం లేకపోయినా… ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగడం ప్రధాన ప్లస్ పాయింట్.
The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…
Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…