Telugu

హీరోయిన్లపై వేధింపులు ఎక్కువవుతున్నాయ్!

దక్షిణాది చిత్రాలలో రాణించిన హీరోయిన్ అమలాపాల్‌ తాజాగా లైంగిక వేధింపులకు గురైంది. ఈ మేరకు చెన్నైలోని మాంబళం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. డాన్స్ స్కూల్ యజమాని, పారిశ్రామిక వేత్త అయిన అళగేశన్ తనతో అసభ్యంగా, అశ్లీల భావంతో మాట్లాడాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

ADVERTISEMENT

మలేసియాలో ఉన్న తన స్నేహితుడితో డిన్నర్ కు వెళ్లాలని కోరాడని ఈ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపాల్ మాట్లాడుతూ, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మాటలు, చేతలతో లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

నిజానికి ఒక్క అమాలాపాల్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో హీరోయిన్లపై లైంగిక వేధింపుల పర్వం ఎక్కువవుతోంది. బహుశా అంతకుముందుతో పోలిస్తే… హీరోయిన్లు అన్నీ ఓపెన్ గా మాట్లాడుతుండడం కొంతవరకు దీనికి కారణం అవుతుందేమో గానీ, వారికి కూడా వ్యక్తిగత భావజాలం, స్వేఛ్చ ఉంటాయన్న విషయాలు మరిచిపోకూడదు కదా!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

NBK111: Balayya’s Return Has Become Crucial

Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…

26 minutes ago

OG 2: What Sujeeth Planned for Pawan Fans

Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…

56 minutes ago