
జగన్ 5 ఏళ్ళ రాక్షస పాలన చూసి ఆంధ్రాలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు పెట్టేందుకు ఎవరూ సాహసించ లేదు. ఆ కారణంగా వారందరికీ నమ్మకం కలిగించడమే సిఎం చంద్రబాబు నాయుడు పెద్ద పని అయిపోయింది ఇప్పుడు.
కానీ ఐటి, పరిశ్రమల రంగం అభివృద్ధిపై సిఎం చంద్రబాబు నాయుడుకి ఉన్న అవగాహన, ప్రత్యేక ఆసక్తి గురించి తెలిసినవారు ఆయనపై నమ్మకంతో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నియోజకవర్గాలు మోహన్, గూగుల్ సంస్థ ఆసియా విభాగం అధిపతి సంజయ్ గుప్తాలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమై అమరావతిలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి ఒప్పించారు. అంతేకాక రాజధాని అమరావతికి గూగుల్ సాంకేతిక సహకారం అందించేందుకు సంజయ్ గుప్తా అంగీకరించారు.
ఐదేళ్ళుగా పాడుబెట్టబడిన అమరావతి పునరుద్దరణే ఎంతో కష్టమనుకుంటే అక్కడ గూగుల్, యూట్యూబ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటవుతుండటం రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ సంతోషం కలిగించే విషయమే. ఈ శుభవార్తని సిఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో ధర్నా చేసి దుష్ప్రచారం చేసిన జగన్, నేటికీ అదే ధోరణితో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నవారిని వెనక్కు తిరిగిపోయేలా చేస్తున్నారు.
అంటే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేసిన విధ్వంసం చాలదన్నట్లు దిగిపోయినా రాష్ట్రానికి ఇంకా నష్టం కలిగిస్తున్నారన్న మాట. తనకు చేతకాని అభివృద్ధిని సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారనే అసూయ కావచ్చు. లేదా తాను 5 ఏళ్ళ పాటు సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెట్టినా రాని మంచిపేరు అమరావతి పునర్నిర్మాణంతో, పరిశ్రమలను రప్పించడం ద్వారా సిఎం చంద్రబాబు నాయుడుకి వస్తోందనే ఉక్రోషంతో జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారేమో?
‘గేమ్ చేంజర్’ పేరుతో ఓ వ్యక్తి సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ గూగుల్, యూట్యూబ్ సంస్థలని ఉద్దేశ్యించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు బాగోలేవని, అమరావతి ముంపు ప్రాంతమని అక్కడ మీ సంస్థలు ఏర్పాటు చేస్తే మీ మహిళా ఉద్యోగులకు భద్రత ఉండడంటూ దాని సారాంశం.
సిఎం చంద్రబాబు నాయుడు ట్వీట్‌కి బదులుగానే ఇది పెట్టినందున, రాజకీయ దురుదేశ్యంతోనే చేసిన్నట్లుగా అర్దమవుతోంది.
కనుక పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడం కంటే ముందు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న ఇటువంటి ద్రోహులను ఉక్కుపాదంతో అణచివేయకపోతే సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. అలాగే ఇది వైసీపి చేయిస్తున్నా దుష్ప్రచారమా కాదా? అని కూడా ఆరా తీయడం చాలా ముఖ్యం.
Allu Arjun is trying every possible way to stay in the pan-India limelight. Despite delivering…
Star music composer, Anirudh Ravichander is currently focussed on his film with superstar Rajinikanth, which…