
అమరావతికి కాస్త దూరంగా ఉండే ఇతర జిల్లాల ప్రజలకి రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులు గురించి పెద్దగా తెలియకపోవచ్చు. దాని చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు జెట్ స్పీడుతో అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయని బాగా తెలుసు. అమరావతిని వద్దనుకుంటున్న వైసీపీ నాయకులకు ఇంకా బాగా తెలుసు. మావిగన్ల ఆక్రోశం, ఆక్రందనలు అందువల్లే!
గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికలలోగా అమరావతికి రూపురేఖలు తెచ్చి ఆవిష్కరించాలని సిఎం చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు.
అందుకే అమరావతిలో రేయింబవళ్ళు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కనుక చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, యూట్యూబర్స్ అక్కడకి వెళ్ళి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు ఫాలో అవుతున్నవారికి కూడా నానాటికీ మారుతున్న అమరావతి రూపురేఖలు అర్థం చేసుకోగలరు.
వైసీపీ నేతలకు కూడా ఈపాటికి ఒక విషయం అర్దమయ్యే ఉంటుంది. తాము ఎంత గొంతు చించుకున్నా అమరావతి నిర్మాణ పనులు ఆగవని… ఆపలేమని!
వచ్చే ఎన్నికలలో అమరావతి పేరుతోనే కూటమి ప్రభుత్వం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రోడ్లు, రైల్వే లైన్లు వంటివి చాలా పెద్ద జాబితాయే ఉంది. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి గంపగుట్టగా ఓట్లు రాల్చేవే… అని తెలిసి ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ వాటికి తగిన వ్యూహాలు సిద్దం చేసుకోవాలి. కానీ ‘రప్పా రప్పా మావిగాన్’ అంటూ పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తూ తమ వేళ్ళతో తమ కళ్ళను పొడుచుకునేలా చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అంతమాత్రన్న జగన్మోహన్ రెడ్డి అక్కువగా అంచనా వేయలేము. ఆయన తుమ్మినా, దగ్గినా వ్యూహాత్మకమే! కనుక ఈ ‘రప్పా రప్పా మావిగాన్’ కూడా గొప్ప వ్యూహమే అని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…