Telugu

అమరావతిలో అంబటిరాయుడు క్లీన్ బౌల్డ్!

క్రికెట్‌లో ఉన్నప్పుడు అంబటిరాయుడు అందరివాడు. దానిని వదిలేసి బయటకు వచ్చేసిన తర్వాత వైసీపీతో అంటకాగుతుండటంతో కొందరివాడిగా మారిపోయాడు. ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చు. కనుక వైసీపీలో చేరినందుకు అతనిని తప్పు పట్టలేము. అయితే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా వైసీపీ పాలన సాగిస్తోందని, రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేసిందని తెలిసి ఉన్నా అతను వైసీపీ తరపున బ్యాటింగ్‌కు దిగుతుండటమే ఆక్షేపనీయం.

ADVERTISEMENT

వైసీపీ నేతల అభ్యర్ధన మేరకు సోమవారం అతను వెలగపూడిలో వీరభద్రస్వామి ఆలయానికి వచ్చారు. ఈవిషయం తెలుసుకొన్న అమరావతి రైతులు అక్కడికి చేరుకొని తామందరం తమ జీవనోపాధి అయిన వ్యవసాయభూములను అమరావతి కోసం ఇచ్చామని కానీ జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మించకుండా మూడు రాజధానులంటూ కాలక్షేపం చేస్తోందని గుర్తుచేసారు. అమరావతి కోసం తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపవలసిందిగా వారు కోరారు. ఓసారి తమ దీక్షా శిబిరానికి వచ్చి అక్కడ రైతులతో మాట్లాడవలసిందిగా కోరారు.

కానీ అంబటి రాయుడు ‘అమరావతి ఎక్కడికి వెళ్ళిపోదుగా… మళ్ళీ వస్తాను,” అని చెప్పి వెళ్ళిపోబోతుంటే, కనీసం ‘జై అమరావతి’ అని నినాదం చేయవలసిందిగా రైతులు కోరారు. కానీ దానికి అతను నిరాకరించి “మళ్ళీ వస్తానని చెప్పాను కదా… ఇప్పుడు ఎందుకీ గొడవ?” అని విసుకొంటూ వెళ్ళిపోయారు. అంబటి రాయుడు వైసీపీ తరపున ఇంకా బ్యాటింగ్‌కు దిగక మునుపే ఏపీ ప్రజల దృష్టిలో అప్పుడే క్లీన్ బౌల్డ్ అయిపోయారు.

అతను వైసీపీలో చేరి టికెట్‌ ఇస్తే ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం కలిగించలేరు. వైసీపీ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించలేరు. అంటే ఆయన కూడా త్వరలోనే వైసీపీ కళ్ళద్దాలు పెట్టుకొని దాని భాషలో మాట్లాడటం మొదలుపెట్టడం ఖాయమే అని భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nagarjuna Surprised After Watching Itllu Arjuna

Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…

4 minutes ago

మిగులు విద్యుత్ దశకు ఏపీ, విద్యుత్ సంక్షోభంలో తెలంగాణ!

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బ్రేకులు వేసినట్లు ఐదేళ్ళపాటు అభివృద్ధి…

23 minutes ago