Telugu

హైదరాబాద్‌కు నీటి కరువు.. అమరావతికి వద్దంటే నీళ్ళు!

“సీఎం చంద్రబాబు నాయుడు మొండిగా రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంలో కడుతున్నారు. చిన్న వర్షం వచ్చినా మునిగిపోతుంది. అలా మునిగిపోకుండా ఉండేందుకు నీళ్ళు తోడిపోస్తున్నారు. ఇదెక్కడి చోద్యం?” అంటూ వైసీపీ విమర్శిస్తూనే ఉంటుంది.

తమకు ఇష్టం లేని అమరావతి మునిగిపోయిందని నిరూపించేందుకు నకిలీ ఫొటోలు, నకిలీ వీడియోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది.

ADVERTISEMENT

అయితే అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నేటికీ వర్షం పడితే మునుగుతూనే ఉంటుంది. మిగిలిన సమయాల్లో తాగునీటికి కటకటలాడుతూనే ఉంటుంది.

ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రభుత్వం నీళ్ళ వాడకంపై ఆంక్షలు కూడా విధించింది. హైదరాబాద్‌ నగరానికి ఇక ఎప్పటికీ తాగునీటి కరువు రాదని కేసీఆర్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. కానీ వాస్తవ పరిస్థితి ఇది.

అయితే అమరావతి ముంపు ప్రాంతంలో ఉండటమే ఓ పెద్ద వరంగా మార్చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి చుట్టూ నీరుకొండ, పెనుమాక, కృష్ణాయపాలెం, శాఖమూరు, వైకుంఠపురం (బ్యారేజీ)లను నిర్మింపజేసి, వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాటిలో ఒడిసిపట్టేలా చేశారు.

నీరుకొండ రిజర్వాయర్: ఇది అతిపెద్ద మానవ నిర్మిత జలాశయం. సుమారు 440 నుంచి 450 ఎకరాల విస్తీర్ణంలో, 0.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉంది. దీనిని కొండవీటి వాగు కాలువతో అనుసంధానించారు.

పెనుమాక రిజర్వాయర్: సుమారు 190 ఎకరాల విస్తీర్ణంలో, 0.1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో విస్తరించి ఉంది. స్థానికంగా వర్షపు నీటిని ఒడిసిపట్టడంతో పాటు వరద నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

కృష్ణాయపాలెం రిజర్వాయర్: కొండవీటి వాగు, పాలవాగు కాలువలు కలిసే చోట సుమారు 190 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. దీని సామర్థ్యం 0.1 టీఎంసీ. ఇది కూడా వరద నివారణకు, నీటి నిర్వహణకు చాలా కీలకం.

శాఖమూరు రిజర్వాయర్: శాఖమూరు సెంట్రల్ పార్క్ ప్రాంతానికి సమీపంలో 44 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ చిన్న జలాశయం ఉంది. దీని సామర్థ్యం 0.03 టీఎంసీ.

వైకుంఠపురం బ్యారేజీ: ఇది ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై ఉంది. దీని సామర్థ్యం 10 టీఎంసీలు. రాజధానిలోని కాలువలకు, నీటి సరఫరా వ్యవస్థలకు ఇది ప్రధాన ఆధారంగా పనిచేస్తుంది.

కనుక అమరావతిలో కుండపోతగా వానలు కురిసినా, కొండవీటి వాగుకు వరద వచ్చినా అమరావతి మునిగిపోదు. ఆ నీళ్ళన్నీ చుట్టూ ఉన్న ఈ రిజర్వాయర్లలోకి వెళ్ళిపోతాయి. వైకుంఠపురం బ్యారేజీ మినహాయిస్తే అన్నీ కలిపితే మొత్తం 0.63 టీఎంసీలు!

వర్షాకాలంలో వచ్చిన ఈ నీళ్ళన్నీ ఏడాది పొడవునా వీటిలో నిల్వ ఉంటాయి. నీళ్ళను ఇంత చక్కగా నిల్వ చేసుకుని ఏడాది పొడవునా అమరావతితో సహా చుట్టుపక్కల ప్రాంతాల అవసరాలకు వాడుకోవడం తెలివైన పనే కదా? అయినా అమరావతిలో నీళ్ళతో ప్రభుత్వంపై బురద జల్లడం దేనికి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ramayana Box Office: Huge Numbers, But Less Footfalls?

The way we measure a film's success has changed considerably over the years. Earlier, footfalls…

21 minutes ago

మన రాష్ట్రాన్ని ఎవరో దోచుకోవడం ఏమిటి?

"మన తెలంగాణను ఆంధ్రా పాలకులు, కాంట్రాక్టర్లు దోచుకు తినేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గానీ వారి దోపిడీ నుంచి మనకు…

41 minutes ago