Telugu

మన రాష్ట్రాన్ని ఎవరో దోచుకోవడం ఏమిటి?

“మన తెలంగాణను ఆంధ్రా పాలకులు, కాంట్రాక్టర్లు దోచుకు తినేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గానీ వారి దోపిడీ నుంచి మనకు విముక్తి లభించదు. తెలంగాణ ఏర్పడితే అందరి బతుకులు మారిపోతాయి. మన నీళ్ళు, మన నిధులు మనకే దక్కుతాయి. మన పిల్లలకే ఉద్యోగాలు లభిస్తాయి. ఇలాంటి మాటలు ఎన్ని వందల, వేలసార్లు ప్రజలు విన్నారో వారికే తెలియదు.

తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది… అని బీఆర్ఎస్‌ పార్టీ నేటికీ చెప్పుకుంటుంది.

ADVERTISEMENT

కానీ కేసీఆర్‌ హయాంలోనే కల్వకుంట్ల కుటుంబం, మాజీ మంత్రులు, పార్టీ నేతలు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు. ఎవరెవరు ఎంతెంత డబ్బు, వందల కోట్ల విలువ చేసే భూములు దోచుకున్నారో లెక్కలు కూడా చెబుతుంటారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌ రెడ్డి సోదరులు, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారంటూ కేటీఆర్‌, హరీశ్‌రావు ఆరోపించని రోజు లేదు.

తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఇదే చెప్పారు.

జడ్చర్లలో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, “ప్రభుత్వ విభాగాల్లో అవినీతి చాప కింద నీరులా విస్తరించిపోయిందని అన్నారు. ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తికి చిన్న కాంట్రాక్ట్ ఇవ్వాలని నేను సిఫార్సు చేస్తే అధికారులు పట్టించుకోలేదు. కానీ అదే వ్యక్తి రూ.15 వేలు లంచం ఇవ్వగానే ఆ పని అతనికే అప్పగించారు.

ఆర్‌ అండ్‌ బీలో కొందరు అధికారులు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటుంటే, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రజల నుంచి లంచాలు పిండుకుంటున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనైతే రోజుకు కనీసం రూ.1-2 లక్షల వరకు దండుకుంటూనే ఉన్నారు.

ఇలాంటి లంచగొండి అధికారుల వల్ల మా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. అటువంటి వారిని మీరే (జర్నలిస్టులు) బయటపెట్టాలి. అప్పుడు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంది,” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.

నాడు ఆంధ్రా పాలకులు, నేతలు తెలంగాణను దోచుకుతినేస్తున్నారని వాదించిన వారే ఇప్పుడు తమ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ఈ పరస్పర ఆరోపణలతో స్పష్టమవుతోంది.

అంటే తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా అవినీతి, దోపిడీ కామన్ అన్నమాట! ఇందుకేనా.. తెలంగాణ కోసం కొట్లాడింది? ఇందుకేనా 1,500 మంది బలిదానాలు చేసుకున్నది?

తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్లలోనే ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల ఊబిలో కూరుకు పోవడమే కాకుండా, ఇంకా ఈ విధంగా దోపిడీకి గురవుతూనే ఉండటం చాలా బాధాకరమే కదా?

అయినా పాలకులే అవినీతికి పాల్పడుతున్నప్పుడు అధికారులు ఒడ్డున కూర్చుంటారని ఆశించడం దురాశే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Aakasamlo Oka Tara Receives Censor Clearance

Aakasamlo Oka Tara has generated interest following the release of its trailer. The promotional video…

20 minutes ago

AP Municipal Elections: 7,508 Nominations Filed in Second Phase

The nomination process for the second phase of Andhra Pradesh municipal elections has concluded across…

49 minutes ago